Begin typing your search above and press return to search.

లాక్‌ డౌన్‌ లో కొత్త జంట ప్రయాణంకు నాటకం..!

By:  Tupaki Desk   |   3 May 2020 1:16 PM GMT
లాక్‌ డౌన్‌ లో కొత్త జంట ప్రయాణంకు నాటకం..!
X
కరోనాను అదుపు చేసేందుకు లాక్‌ డౌన్‌ తప్ప మరే మార్గం లేదనే ఉద్దేశ్యంతో ప్రపంచంలోని పలు దేశాల్లో లాక్‌ డౌన్‌ అమలు అవుతుంది. లాక్‌  డౌన్‌ కు ఒప్పుకోని అమెరికాలో పరిస్థితి ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే కేసులు వందల్లో ఉన్న సమయంలోనే ఇండియాలో లాక్‌ డౌన్‌ చేశారు. లాక్‌ డౌన్‌ కారణంగా ఇండియాలో పరిస్థితి చాలా వరకు అదుపు అయ్యిందని లేదంటే లక్షల్లో కేసులు నమోదు అయ్యేవంటూ నిపుణులు చెబుతున్నారు. లాక్‌ డౌన్‌ ను ఎంత పకడ్బందీగా అమలు చేస్తున్నా కూడా కొందరు రకరకాలుగా దాన్ని ఉల్లంఘిస్తూనే ఉన్నారు.

కొందరు చేసిన కారణంగా కేసుల పెరుగుతూనే ఉన్నాయి. దాంతో పోలీసులు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. రోడ్లపై అనుమతులు లేని వాహనాలు కనిపిస్తే సీజ్‌ చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తున్నారు. అంబులెన్స్‌ లకు అనుమతులు ఉన్న కారణంగా కొందరు వాటిని ఉపయోగించి ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశంకు ప్రయాణించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌ కు చెందిన నూతన వధువరులు మరియు వారి కుటుంబ సభ్యులు అంబులెన్స్‌ లో ప్రయాణిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు.

ఉత్తర ప్రదేశ్‌ లోని ఘజియాబాద్‌ నుండి ముజఫర్‌ నగర్‌ నగర్‌ వరకు ఆంబులెన్స్‌ లో కొత్త జంట వారి కుటుంబ సభ్యులు ప్రయాణించారు. మొత్తం తొమ్మిది మంది ఆంబులెన్స్‌ లో ప్రయాణించడం గమనించిన పోలీసులు కాస్త గట్టిగా విచారించగా అసలు విషయం చెప్పారు. అవసరం లేకున్నా కూడా లాక్‌ డౌన్‌ లో వారు ప్రయాణించడంతో కేసు నమోదు చేయడం చేశారు.

ఆంబులెన్స్‌ ను సీజ్‌ చేసిన పోలీసులు డ్రైవర్‌ పై కఠిన చర్యలకు సిద్దం అయ్యారు. ఆంబులెన్స్‌ ను దుర్వినియోగం చేస్తే ఊరుకునేది లేదంటూ ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. అయినా కూడా డబ్బుకు ఆశపడి ఇలా చేసినందుకు గాను ఆ డ్రైవర్‌ పై కేసు నమోదు అయ్యింది. ఇలాంటి సంఘటనలు దేశంలో ఏదో ఒక మూల నమోదు అవుతున్నాయి.