Begin typing your search above and press return to search.

భార్యకు 'ప్రేమ కానుకగా' భర్త ఏమిచ్చాడో తెలుసా..!

By:  Tupaki Desk   |   12 Dec 2022 7:30 AM GMT
భార్యకు ప్రేమ కానుకగా భర్త ఏమిచ్చాడో తెలుసా..!
X
పెళ్లి అంటే అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూసే రోజులు పోయాయి. కనీసం ఒక్క తరం చూసే ఓపిక కూడా ఎవరికీ లేదు. మ్యాట్నీ మోనియో వెబ్ సైట్లలో రిజిస్టర్ కావడం.. వాట్సాపుల్లో ఛాటింగులు.. వీడియో కాల్స్ చూసుకోవడం ఆపై పెళ్లి పీఠ లెక్కడం వంటి సంఘటనలు ప్రస్తుత రోజుల్లో షారా మాములుగా మారిపోయింది.

ప్రేమపై నమ్మకం పోతున్న ఈ రోజుల్లో కూడా అక్కడ అబ్బాయి.. ఇక్కడ అమ్మాయి తరహాలో కొందరు లవ్ మ్యారేజీలు చేసుకుంటున్నారు. ఆరెంజ్ మ్యారేజ్ అయినా.. లవ్ మ్యారేజీ చివరికీ సంసారం అనే చదరంగంలో భార్యభర్తలు పావులు కాక తప్పదని అందరికీ తెలిసిందే. పెళ్లి చేసుకోవడం ఓ లెక్క అయితే దానిని నిలబెట్టుకోవడం మరో లెక్క అన్న చందంగా ప్రస్తుత వివాహ వ్యవస్థ మారిపోయింది.

ఇటీవలి కాలంలో పెళ్లిళ్లన్నీ మున్నాళ్ల ముచ్చటగా మారుతున్నాయి. డేటింగ్.. సహజీవనం కల్చర్ పెరుగుతున్న నేటి కాలంలోనూ యువతకు పెళ్లిపై నమ్మకం మాత్రం పోవడం లేదు. దీంతో ముచ్చటగా మూడు ముళ్లు వేసేందుకు తెగ ఆరాట పడుతున్నారు. తాజాగా ఓ పెళ్లి వేడుకలో వరుడి తన కాబోయే భార్యకు ఒక విచిత్రమైన గిప్ట్ ఇచ్చి సర్ ప్రైజ్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

అసలు విషయానికొస్తే.. పాకిస్తాన్ కు చెందిన అజ్లాన్ షా ఒక పేరున్న యూట్యూబర్.. జంతు ప్రేమికుడు కూడా. అజ్లాన్ షా వారిషా అనే యువతిని ఇటీవలే ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లి వేడుకల్లో ఆమెకు ఓ గాడిద పిల్లను బహుమతికి ఇచ్చి సర్ ప్రైజ్ చేశాడు. లోకంలో ఏ గిప్ట్ లేనట్టు గాడిద పిల్లనే ఎందుకు గిప్ట్ గా ఇచ్చావని ప్రశ్నిస్తే అతడు చెప్పిన సమాధానం అందరినీ ఆకట్టుకుంటోంది.

గాడిదలంటే తనకెంతో ఇష్టమని.. ప్రపంచంలో అత్యంత కష్టజీవి.. ప్రేమగా ఉండే జీవి అని చెప్పుకొచ్చాడు. తానేమీ తల్లి నుంచి గాడిద పిల్లను వేరు చేయలేదని.. 30వేలు వెచ్చించి దాని తల్లితో సహా కొనుగోలు చేసి వాటిని గాడిద చాకిరి నుంచి తప్పించినట్లు చెప్పాడు. పెళ్లి కొడుకు సమాధానానికి పెళ్లి కూతురు వారిషాతోపాటు అక్కడున్న వారంతా ఫిదా అయిపోయారు.

అజ్లాన్ షా మాదిరిగానే వారిషా సైతం జంతు ప్రేమికురాలేనట. అందువల్ల తానంటే నాకు ఎంతో ఇష్టం ఏర్పడిందని.. అదికాస్తా ప్రేమగా మారి కొత్త జీవితానికి దారితీసిందని అజ్లాన్ షా చెప్పుకొచ్చాడు. కాగా అజ్లాన్ షాకు పామలున్న.. బల్లులన్న.. మొసళ్లన్న కూడా ఇష్టమేనట. మరీ వీటిని ఎప్పుడు తన భార్యకు గిప్ట్ ఇస్తాడనే ఆసక్తికరంగా మారింది. కాగా పెళ్లి కొడుకు.. పెళ్లి కూతురు ప్రేమతో గాడిదను ముద్దాడుతున్న ఫొటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.