Begin typing your search above and press return to search.

తెల్లోడి దెబ్బకు ప్రపంచ మార్కెట్లన్నీ మటాష్

By:  Tupaki Desk   |   24 Jun 2016 6:06 AM GMT
తెల్లోడి దెబ్బకు ప్రపంచ మార్కెట్లన్నీ మటాష్
X
అక్కడెక్కడో తెల్లోడి మెదడులో పుట్టిన ఒక భావన ప్రపంచం మొత్తానికి శాపంగా మారింది. యూరోపియన్ యూనియన్ దేశాలతో కలిసి ఉండకూదంటూ యూకే వాసుల్లో పెరిగిన డిమాండ్ తో రెఫరెండం జరగటం.. అందులో తమ తీర్పును చెప్పిన యూకే వాసుల కారణంగా ప్రపంచ మార్కెట్లన్నీ వణికిపోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా యూకే బ్రెగ్జిట్ ప్రకంపనలతో వణికిపోయే పరిస్థితి.

భారత్ విషయానికే వస్తే.. బ్రెగ్జిట్ ఫలితాలతో సెన్సెక్స్ గజగజ లాడిపోతోంది. ఉదయం మొదలైన స్టాక్ మార్కెట్ బ్రెగ్జెట్ ఫలితాల నేపథ్యంలో సెంటిమెంట్ తీవ్రంగా దెబ్బ తిని.. సెన్సెక్స్ ఏకంగా 900 పాయింట్లు నష్టపోయింది. ఆ తర్వాత కాస్త కోలుకొని 750 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ సాగుతోంది. ఇక.. నిఫ్టీ సైతం 200పాయింట్లు నష్టపోయింది. ఇదిలా ఉండగా.. బ్రెగ్జిట్ ఫలితాలు ప్రపంచ మార్కెట్ల మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. జపాన్ మార్కెట్ సైతం బ్రెగ్జిట్ దెబ్బకు విలవిలలాడుతోంది. ఇదిలా ఉంటే.. బ్రిటన్ వాసుల నిర్ణయంతో ఆ దేశ కరెన్సీ అయిన పౌండ్ సైతం దారుణంగా దెబ్బ తింది. 31 ఏళ్ల కనిష్ట స్థాయికి పౌండ్ విలువ పడిపోవటం గమనార్హం.