Begin typing your search above and press return to search.

బ్రేకింగ్ :సోమవారానికి వాయిదా పడ్డ నిమ్మగడ్డ పంచాయితీ ... !

By:  Tupaki Desk   |   13 April 2020 11:10 AM GMT
బ్రేకింగ్ :సోమవారానికి వాయిదా పడ్డ నిమ్మగడ్డ పంచాయితీ ... !
X
ఆంధ్రప్రదేశ్‌లో మొన్నటి వరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ ను ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా తొలగించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం తీసుకున్న చర్య రాజ్యాంగ విరుద్ధం అంటూ ఏపీ హైకోర్టు లో మొత్తం ఆరు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని విచారణకి స్వీకరించిన హైకోర్టు, దీనిపై ప్రభుత్వం గురువారం కల్లా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చెయ్యాలని కోరింది. ఆ తర్వాత విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

ఇప్పటికే ఉన్న ఎన్నికల మిషనర్‌ ను ఆర్డినెన్స్ ద్వారా తొలగించి., ఆ స్థానంలో మరో ఎన్నికల మిషనర్‌ ను తీసుకురావడంతో, ఈ విషయాన్ని కోర్టులోనే తేల్చుకోవాలని డిసైడైన రమేష్ కుమార్ తనను ప్రభుత్వం అక్రమంగా తొలగించిందంటూ హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేశారు. తనను తొలగిస్తూ జారీ చేసిన జీవో రాజ్యాంగ వ్యతిరేకమని పిటిషన్‌ లో పేర్కొన్నారు. రమేష్ కుమార్ తరపున లాయర్ అశ్వనీకుమర్‌ హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ వెయ్యగా... హైకోర్టు విచారణకు తీసుకుంది. అయితే , ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఆర్డినెన్స్ పై స్టే విధిస్తారు అని అనుకున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ కు హైకోర్టు లో షాక్ తగిలింది.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పదవీకాలాన్ని ఐదేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం గత వారం నిర్ణయం తీసుకుంది. అందుకోసం పంచాయతీరాజ్‌ చట్టంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నియామకానికి సంబంధించిన సెక్షన్‌ 200ని మార్చుతూ శుక్రవారం ఆర్డినెన్స్‌ పాస్ చేసింది. ఈ ఆర్డినెన్స్‌ తీసుకురావడం , మూడు బిల్లులు పాస్ కావడం శుక్రవారం చాలా వేగంగా జరిగాయి. ఆర్డినెన్స్‌లో చెప్పిన అంశాలపై శుక్రవారం రాత్రి జీవో నెం.617ని ప్రభుత్వం పబ్లిక్ డొమైన్‌లో పెట్టింది. ఆర్డినెన్స్‌ అమల్లోకి రావడంతో రమేశ్‌ కుమార్‌ పదవీకాలం ముగిసిందంటూ జీవో జారీ చేసి , వెంటనే ఆంధ్రప్రదేశ్ కొత్త ఎన్నికల కమిషనర్‌గా ప్రభుత్వం రిటైర్డ్ జడ్జి కనగరాజ్‌ ని నియమించింది. శనివారమే ఆయన బాధ్యతలు కూడా స్వీకరించేశారు. కాగా, ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం అని నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో ఫీల్ వేసినా కూడా హైకోర్టు దీనిపై తుదితీర్పు వెలువరించేవరకు ఏపీ ఎన్నికల కమిషనర్‌ గా ప్రభుత్వం రిటైర్డ్ జడ్జి కనగరాజ్‌ కొనసాగనున్నారు. అయితే, ఇప్పుడు హైకోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేస్తుందా ?లేక సమర్థిస్తుందా అనేది తెలియాలి అంటే సోమవారం వరకు వేచి చూడక తప్పదు..