Begin typing your search above and press return to search.

బ్రేకింగ్: ఎంపీ సుజనాకు ఈడీ నోటీసులు

By:  Tupaki Desk   |   10 Feb 2021 9:05 PM IST
బ్రేకింగ్: ఎంపీ సుజనాకు ఈడీ నోటీసులు
X
బ్యాంకుల రుణ చెల్లింపుల కేసులో బీజేపీ ఎంపీ సుజనా చౌదరికి చిక్కుల్లో పడ్డారు. ఆయన టీడీపీని వీడి బీజేపీలో చేరినా ఈ కేసుల చిక్కుముడులు సుజనాను వీడకపోవడం చర్చనీయాంశమవుతోంది.తాజాగా సుజనాచౌదరికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 12వ తేదీన విచారణకు హాజరు కావాలని వాటిలో పేర్కొంది.

డొల్ల కంపెనీలతో రూ.5700 కోట్ల మేర మోసం చేసినట్లు సుజనాపై అభియోగాలున్నాయి. కేంద్రమంత్రిగా ఉన్నప్పుడే ఈ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. వీటి ఆధారంగానే ఆయనపై ఈడీ 2018లో తనిఖీలు చేసి కేసు పెట్టింది.తాజాగా ఆయన 126 షెల్ కంపెనీలు సృష్టించినట్లు ఈడీ ఆధారాలు సేకరించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే సుజనా చౌదరికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.