Begin typing your search above and press return to search.

బ్రేకింగ్: కేబినెట్ ఆమోదం.. ఏపీ శాసనమండలి రద్దు

By:  Tupaki Desk   |   27 Jan 2020 10:27 AM IST
బ్రేకింగ్: కేబినెట్ ఆమోదం.. ఏపీ శాసనమండలి రద్దు
X
ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఉదయం సమావేశమైన ఏపీ కేబినెట్ ఈ మేరకు శాసనమండలిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేబినెట్ లో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. అందరు మంత్రులు జగన్ నిర్ణయానికి జైకొట్టారు. మండలి రద్దుపై తీర్మానం చేశారు. దాదాపు 151మంది ఎమ్మెల్యేలతో ప్రజాబలంతో గద్దెనెక్కిన జగన్ కు తన పాలనకు అడ్డుగా బిల్లులను అడ్డుకుంటున్న శాసన మండలిని రద్దు చేయాలనే డిసైడ్ అవ్వడం సంచలనంగా మారింది.

ఏపీ శాసనమండలిలో వైసీపీకి బలం లేదు. కేవలం 9 మంది ఎమ్మెల్సీలు మాత్రమే ఉన్నారు. శాసనసభలో 23మంది మాత్రమే ఎమ్మెల్యేలున్న టీడీపీకి అపార బలం ఉంది. ఏకంగా మండలిలో ఆ పార్టీకి 28మంది ఎమ్మెల్సీలున్నారు. వచ్చే ఐదేళ్ల లోనూ జగన్ సర్కారు మండలి లో బలం పుంజుకునే అవకాశాలు లేవు. పైగా జగన్ సర్కారు శాసనసభలో ఆమోదించిన బిల్లులను మండలి ద్వారా అడ్డుకుంటూ జగన్ ముందరి కాళ్లకు బాబు బంధాలు వేస్తున్నారు.

ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తానన్న జగన్ హామీలకు మండలి అడ్డుకట్టవేస్తోంది. ఇప్పటికే ఏపీ 3 రాజధాను ల సహా ఇంగ్లీష్ మీడియం చదువులు ఇలా కీలక బిల్లులకు అడ్డుపుల్ల వేసింది. అందుకే జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

సోమవారం ఉదయం సమావేశమైన కేబినెట్ భేటిలో శాసన మండలిని రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో ఏపీ మంత్రులు గా కొనసాగుతున్న మోపిదేవి, పిల్లి సుభాష్ సహా లోకేష్, యనమల ఇలా కీలక ఎమ్మెల్సీల పదవులు పోనున్నాయి.