Begin typing your search above and press return to search.
ట్రంప్ ఏకపక్ష నిర్ణయానికి కోర్టులో బ్రేక్.. గ్రీన్‌కార్డు దరఖాస్తు దారులకు ఊరట
By: Tupaki Desk | 4 Oct 2020 4:00 PM ISTట్రంప్ విధించిన ఆంక్షలతో విలవిలలాడుతున్న గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులకు కోర్టులో ఊరట లభించింది. గ్రీన్‌కార్డు కోసం అమెరికాలో కోటి 40 లక్షల మందికి దరఖాస్తు చేసుకున్నారు. డైవర్సిటీ వీసాగా పిలిచే ఈ గ్రీన్‌కార్డు కోసం వీరంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం లాటరీ పద్ధతిలో గ్రీన్‌కార్డులను జారీ చేస్తున్నది. ఈ లెక్కన ఏడాదికి కేవలం 55 వేల మందికి మాత్రమే గ్రీన్‌కార్డు వస్తుంది. జారీ ప్రక్రియ ఇలాగే కొనసాగితే కొంతమందికి తామూ జీవితాంతం ఎదురుచూసినా గ్రీన్‌కార్డు రాదు.
మరోవైపు గ్రీన్‌కార్డు దరఖాస్తుదారుల ఆశలపై నీళ్లు జల్లే నిర్ణయం తీసుకుంది ట్రంప్ ప్రభుత్వం. గ్రీన్‌కార్డుల జారీని నిలిపివేసింది. నిబంధనల ప్రకారం లాటరీ పద్ధతిలో ఎంపికైన 55 వేల మంది సెప్టెంబర్ 30లోగా గ్రీన్‌కార్డులు తీసుకోవాలి. అలా తీసుకోలేని వాళ్లు అనర్హులవుతారు.
అయితే, వీసాల జారీపై ఈ ఏడాది ఏప్రిల్‌లో తాత్కాలిక నిషేధం విధించింది ట్రంప్ సర్కారు. తొలుత 60 రోజుల పాటు వీసా జారీని ఆపేసిసింది. దీంతో 55 వేల మంది లబ్ధిదారులు ఎదురుచూస్తూ ఉండాల్సి వచ్చింది. 60 రోజుల తర్వాత కూడా వీసా ప్రాసెసింగ్ ప్రారంభం కాకపోవడంతో కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టుకెళ్లిన 9,095 మందికి ఉపశమనం లభించింది. వాళ్ల స్లాట్లను భద్రంగా ఉంచాలని, వాళ్లకు వీసాలు జారీ చేయాలని ఫెడరల్ కోర్టు ఆదేశించింది. గ్రీన్‌కార్డును పొందేందుకు లాటరీలో ఎంపికైన వాళ్లు... వీసాల జారీని నిలిపివేయడం వల్ల నష్టపోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది. కరోనా వల్ల వీసాల ప్రాసెసింగ్ మందకొడిగాసాగింది కనుక, దరఖాస్తుదారులకు నష్టం జరగకూడదని తీర్పు చెప్పింది ఫెడరల్ కోర్టు. కోర్టు నిర్ణయంతో గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులు ఊపిరి పీల్చుకున్నారు.