Begin typing your search above and press return to search.
'బ్లూ ఆరిజిన్' ప్రయోగానికి బ్రేక్ .. ఎందుకంటే !
By: Tupaki Desk | 11 Oct 2021 12:22 PM ISTప్రముఖ ఆన్ లైన్ సంస్థ అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ను అంతరిక్షంలోకి తీసుకెళ్లిన ‘బ్లూ ఆరిజిన్’.. గిన్నిస్ రికార్డు క్రియేట్ చేసింది. అంతేకాదు దటీజ్ బ్లూ ఆరిజిన్ అన్నట్లుగా ఏకంగా నాలుగు రికార్డులను తన ఖాతాలో వేసుకుంది.2021 జులైలో జెఫ్ బెజోస్ తో పాటు ఆయన టీమ్ అంతరిక్షయానం చేసి వచ్చిన విషయం తెలిసిందే. వీరి అంతరిక్ష నౌక సురక్షితంగా.. విజయవంతంగా.. భూమ్మీదకు ల్యాండ్ అయిన కొన్ని నెలల తరువాత బ్లూ ఆరిజిన్ టీమ్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లోకెక్కింది. అంతరిక్షయానం రేసులో ప్రయోజనం పొందేందుకు బ్లూ ఆరిజిన్ భద్రతా సమస్యలను విస్మరించిందనే వాదనల మధ్య.. ఈ రాకెట్ ప్రపంచ రికార్డులు నెలకొల్పింది.
మొదటి బృంద మిషన్ విజయవంతంగా ప్రారంభించటం అంతకంటే విజయవంతంగా ల్యాండింగ్ అయిన కొన్ని నెలల తర్వాత జెఫ్ బెజోస్ కు చెందిన ‘బ్లూ ఆరిజన్’ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో తన పేరును నమోదు చేసుకుంది. అంతరిక్షంలోకి బాస్ జెఫ్ బెజోస్ ని తీసుకెళ్లిన ఈ విమానం నాలుగు ప్రపంచ రికార్డులను సృష్టించింది.అంతరిక్ష ప్రయాణం, అభివృద్ధి చెందుతున్న స్పేస్ టూరిజం రంగాన్ని బలోపేతం చేసిందని చెప్పవచ్చు. కార్మెన్ లైన్ పైన (భూమికి 100 కి.మీ.) పైన అంతరిక్ష నౌకలో నలుగురు ప్రయాణికులు వెళ్లి భూమికి తిరిగి రావడానికి.. వారు 3 నిమిషాల పాటు ప్రయాణించారు.
ఈ అంతరిక్ష యానంలోకి వెళ్లినవారిలో 82 ఏళ్ల వాలీ ఫంక్..పెద్ద వయసు గల వ్యక్తి కావటం విశేషం. అలాగే అతి వయస్కుడు 19 ఏళ్ల ఆలివర్ డేమన్ ఉన్నారు.వీరితో పాటు అంతరిక్షానికి వెళ్లిన మొదటి తోబుట్టువులుగా జెఫ్ బెజోస్, మార్క్ బెజోస్. అలాగే చెల్లింపు వినియోగదారులను తీసుకువెళ్లిన మొదటి సబార్బిటల్ అంతరిక్ష నౌక (న్యూ షెఫర్డ్).. వంటి నాలుగు ప్రపంచ రికార్డులను ఈ రాకెట్ క్రియేట్ చేసింది. బ్లూ ఆరిజిన్ తన తదుపరి మిషన్ ప్రయాణం అక్టోబర్ 12 న జరుగుతుందని ప్రకటించింది.
అక్టోబర్ 12న బ్లూ ఆరిజిన్ సబ్ ఆర్బిటల్ రాకెట్(ఎన్ ఎస్-18) ద్వారా అంతరిక్ష ప్రయాణానికి అంతా సిద్ధం కూడా చేశారు. ఈ దశలో వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. బలమైన ఈదురుగాలులతో రాకెట్ లాంఛింగ్ కు ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో మంగళవారం ప్రయోగం ఉండబోదని బ్లూ ఆరిజిన్ మిషన్ ఆపరేషన్స్ టీం ప్రకటించింది. బుధవారానికి మిషన్ ను వాయిదా వేశామని, అయితే వాతావరణం అనుకూలించకపోతే ఆరోజు కూడా ప్రయోగం ఉండదని స్పష్టం చేసింది. 60వ దశకలో ప్రపంచాన్ని ఓ ఊపు ఊపిన ‘స్టార్ ట్రెక్’ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న కెనడియన్ నటుడు విలియమ్ షాట్ నర్ ఈ ట్రిప్ లో ఆకాశంలోకి వెళ్లి రానున్నారు. కెప్టెన్ జేమ్స్ క్రిక్ రోల్ లో ఆయన నటన అమోఘం. అయితే, ఈయన్ని అంతరిక్ష ప్రయాణం చేయించడం ద్వారా బ్లూ ఆరిజిన్ స్పేస్ టూరిజం బిజినెస్ పెంచాలని భావించారు సదరు ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ బాస్ జెఫ్ బెజోస్.
ఒకవేళ 90 ఏళ్ల షాట్ నర్ అంతరిక్షంలోకి గనుక వెళ్లొస్తే.. అంతరిక్ష యానం పూర్తిచేసిన అత్యధిక వయసు ఫీట్ దక్కించుకున్న వ్యక్తి అవుతారు. గతంలో నాసా అంతరిక్ష వ్యోమగామి జాన్ గ్లెన్ 77 ఏళ్ల వయసులో డిస్కవరీ షటిల్(1998) ద్వారా యానం పూర్తి చేయగా, అమెరికన్ ఏవియేటర్ వాలీ ఫంక్(82) ఈ ఏడాది జులైలో బ్లూ ఆరిజిన్ విజయవంతంగా పూర్తి చేసిన అంతరిక్ష యానం ద్వారా ఆ ఫీట్ బ్రేక్ చేశారు . అయితే వాలీఫంక్ వెళ్లొచ్చింది. ఇప్పుడు షాట్ నర్ వెళ్లొచ్చేది కార్మన్ లైన్ దాకా మాత్రమే
భూమ్మీదకు వచ్చిన తరువాత జెఫ్ బెజోస్ మాట్లాడుతు , ఇదొక అత్యద్భుతమైన ప్రయాణమని, ఇదొ చరిత్రలో అత్యుత్తమమైనరోజు అని అన్నారు. అలా అంతరిక్షంలోకి వెళ్లి వచ్చిన 571వ వ్యోమగామిగా జెఫ్ బెజోస్ గుర్తింపబడ్డారు. 19 ఏళ్ల ఆలివర్ డేమన్ అంతరిక్షానికి వెళ్లిన అతి చిన్నవయస్సు గలవాడిగా రికార్డు క్రియేట్ చేశాడు. ఆలివర్ హైస్కూల్ గ్రాడ్యుయేట్. 28 మిలియన్ల డాలర్లు చెల్లించి ఈ అంతరిక్షయానం చేశాడు ఆలివర్. డెమెన్ తండ్రి ఓ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ CEO. ఈ అంతరిక్షయానికి టికెట్ వేలం వేయగా 28 మిలియన్ల డాలర్లు చెల్లించి ఆ అవకాశాన్ని ఆలివర్ దక్కించుకున్నాడు.