Begin typing your search above and press return to search.

ప్రపంచానికి ఆక్సిజన్.. మాకేంటి?

By:  Tupaki Desk   |   1 Sep 2019 8:22 AM GMT
ప్రపంచానికి ఆక్సిజన్.. మాకేంటి?
X
ట్విట్టర్ లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దక్షిణ అమెరికాలో అమెజాన్ అడవిలో కార్చిచ్చు చెలరేగడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచానికి 20శాతం ఆక్సిజన్ అందించే అడవులను రక్షించాలని కోరారు. అయితే భారత్ లో మాత్రం అలాంటి అడవుల పరిరక్షణపై ఎవ్వరూ పట్టించుకోరు. ఏదో మొక్కలు నాటామా? వదిలేశామా అన్నట్టుంటుంది కానీ సీరియస్ గా అడవుల పెంపకం సాగుతుంది లేదు. తెలంగాణ హరితహారానికి మొదట ప్రాధాన్యత నిచ్చిన ప్రజలు, ప్రముఖులు, హీరోలు ఇప్పుడు పట్టించుకోవడం లేదు..

సరే మన దుకాణమే బాగాలేదు.. మరి అందరూ అమెజాన్ అడవులను రక్షించాలని ప్రపంచ దేశాలందరూ బ్రెజిల్ దేశాధ్యక్షుడిపై ఒత్తిడి తెస్తున్నారు.. కానీ ఆయన మాత్రం మాకేంటి బొక్కా అని అమెజాన్ అడవుల కార్చిచ్చును కంట్రోల్ చేయడం లేదు. ఇప్పుడు ఇదే ప్రపంచవ్యాప్తంగా అందరినీ షాక్ కు గురిచేస్తోంది.

అమెజాన్ అడువులు దక్షిణ అమెరికా ఖండంలోని 9 దేశాల్లో విస్తరించాయి. ఇందులో బ్రెజిల్ దేశంలో 60శాతం మేర విస్తరించి ఉంది. అయితే ఒక దేశంలో అడవుల వాటా 33శాతానికి ప్రపంచదేశాలు పరిమితం చేశాయి. కానీ బ్రెజిల్ లో ఇది రెట్టింపు. అందుకే ఈ అడవులు మాకొద్దు.. మాకు వ్యవసాయ భూమి కొరత ఉందని.. ప్రపంచానికి ఆక్సిజన్ అందించే మా అడవులు మాకు మాత్రం ఏమీ ఇవ్వడం లేదని.. వాటిని తీసేసి వ్యవసాయం చేసుకుంటామని బ్రెజిల్ అధ్యక్షుడు సిన్స్ బొల్సోనారో వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది.

అమెరికా - చూరల్ సహా అన్ని దేశాలు అడువులను రక్షించాలని అంటున్నాయని.. తమకొచ్చే ప్రతిఫలం దాంతో శూన్యం అని బ్రెజిల్ అధ్యక్షుడు స్పష్టం చేశారు. తమ దేశంలో వ్యవసాయ భూమి కొరత తీవ్రంగా ఉందని.. అమెజాన్ అడవులను ఖాళీచేయడం మాకు అత్యవసరం అని ఆయన స్పష్టం చేశారు.

అయితే బ్రిజిల్ అధ్యక్షుడు కావాలనే అమెజాన్ అడవుల్లో ఇలా అగ్గిరాజేసి వాటి హననానికి ప్రయత్నిస్తున్నాడని ప్రపంచదేశాలు ఆరోపిస్తున్నాయి. జనవరిలో సిన్సో బొల్సోనారా వచ్చేకే అమెజాన్ అడువుల్లో మైనింగ్ - వ్యవసాయ భూములుగా మార్చే ప్రక్రియను మొదలు పెట్టాడని మండిపడుతున్నాయి.