Begin typing your search above and press return to search.

చైనా వ్యాక్సిన్ ను కొనుగోలు చేయం: బ్రెజిల్

By:  Tupaki Desk   |   22 Oct 2020 5:30 PM GMT
చైనా వ్యాక్సిన్ ను కొనుగోలు చేయం: బ్రెజిల్
X
కరోనా వైరస్ ను ప్రపంచం మీదకు వదిలి లక్షలమంది ప్రాణాలు కోల్పోయేలా చేసిన చైనా దేశంపై ప్రజల్లో ఆగ్రహావేశాలు ఇంకా చల్లారడం లేదు. కొన్ని దేశాధినేతలు చైనాపై సత్సంబంధాలు నెలకొల్పుతున్నా సరే.. ప్రజల్లో మాత్రం ఈ మహమ్మారి వ్యాప్తికి కారణమైన చైనా దేశంపై కోపం తగ్గడం లేదు.

ప్రపంచదేశాలతో పోల్చితే వర్ధమాన అభివృద్ధి చెందుతున్న బ్రెజిల్ దేశం చాలా డిఫెరెంట్. ఈ దేశ అధ్యక్షుడు బోల్సోనారో మొదట కరోనా లేదు గిరోనా లేదంటూ మాస్క్ పెట్టుకోకుండా తిరిగాడు. తర్వాత కరోనా బారినపడ్డాడు... దేశమంతా కరోనా బారినపడి ప్రజలు అవస్థలు పడ్డారు. అమెరికా, భారత్ తర్వాత అత్యధిక వ్యాప్తి ఇప్పుడు బ్రెజిల్ దేశంలోనే ఉంది.

ఈ క్రమంలోనే చైనా దేశంతో బ్రెజిల్ కు సత్సంబంధాలు ఉన్నాయి. చైనా కంపెనీ సినోవిక్ రూపొందించిన కరోనా వ్యాక్సిన్ ను కొనుగోలు చేసేందుకు బ్రెజిల్ దేశం భారీ ఆర్డర్ ఇచ్చింది. ఏకంగా 4.6 కోట్ల వ్యాక్సిన్ కొనుగోలుకు సిద్ధమైంది.

ఈ క్రమంలోనే బ్రెజిల్ దేశ ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకాయి. కరోనా వైరస్ ను అంటించిన చైనా దేశం నుంచి వ్యాక్సిన్ కొనుగోలు చేయడం ఏంటన్న విమర్శలు వెల్లువెత్తాయి. చైనా వ్యాక్సిన్ కొనవద్దంటూ ఆ దేశ ప్రజలు సోషల్ మీడియాలో బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారోకు పెద్ద ఎత్తున విన్నవించారు. ట్వీట్లతో ఉద్యమం నడిపారు. దీనికి అధ్యక్షుడు దిగొచ్చాడు.

దీంతో బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారో సంచలన నిర్ణయం తీసుకున్నారు. చైనా కంపెనీ సినోవిక్ రూపొందించిన కరోనా వ్యాక్సిన్ ను తమ దేశం కొనుగోలు చేయదని బ్రెజిల్ అధ్యక్షుడు తాజాగా ప్రకటించారు. అనంతరం 4.6 కోట్ల చైనా వ్యాక్సిన్ ఆర్డర్ ను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు. దీంతో చైనాపై బ్రెజిల్ లో జరుగుతున్న ప్రజా ఉద్యమం చల్లబడింది.

కాగా బుటంటాన్ అనే వ్యాక్సిన్ ను బ్రెజిల్ సొంతంగా తయారు చేస్తోందని.. ప్రజలకు సరఫరా చేస్తామని బ్రెజిల్ ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు.