Begin typing your search above and press return to search.

రూ.2 కోట్ల కారు కొన్న 20 నిమిషాలకే తుక్కు తుక్కు !

By:  Tupaki Desk   |   27 Jun 2020 6:00 AM IST
రూ.2 కోట్ల కారు కొన్న 20 నిమిషాలకే తుక్కు తుక్కు !
X
ప్రపంచంలో అత్యంత దురదృష్టవంతుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఈ కారు కొన్న ఓనర్ అని చెప్పాలి. అదేంటి కారు కొంటే అతడు అదృష్టవంతుడు అవుతాడు కానీ , దురదృష్టవంతుడు ఎలా అవుతాడు అని అనుకుంటున్నారా? ఎన్నెల్లో వేచిన ఉదయం అంటూ 2 కోట్ల విలువైన కారుని కొని ..షో రూమ్ నుండి రయ్ రయ్ అంటూ రోడ్డు మీదకు వచ్చాడు ..కేవలం 20 నిముషాల్లోనే 2 కోట్ల కారు నుజ్జు నుజ్జు అయింది. ఈ ఘటన బ్రిటన్‌లోని వేక్‌ ఫీల్డ్ ‌లో జరిగింది.

రెండు కోట్ల రూపాయల విలువైన గ్రే కలర్ లంబోర్గిని హరికేన్ స్పైడర్ మోడల్ కారును ఓ వ్యక్తి ఎంతో ఇష్టపడి కొనుక్కున్నాడు. కారు తాళం చేతిలో పడిన వెంటనే ఆనందంలో తేలియాడిపోయాడు. కారు స్టార్ట్‌ చేసి కొంతదూరం ప్రయాణించిన తర్వాత కారులో సాంకేతిక లోపం తలెత్తడంతో రోడ్డుపైనే ఆగిపోయింది. దీంతో ఏమైందో తెలుసుకునేందుకు కిందికి దిగాడు.

అతడు కిందికి దిగిన మరుక్షణం వెనక నుంచి వచ్చిన మరో కారు ఈ లంబోర్గినిని బలంగా ఢీకొట్టింది. దీంతో కారు వెనక భాగం పూర్తిగా దెబ్బ తింది. కారు కొన్న 20 నిమిషాల్లోనే కళ్లెదుటగా తుక్కుగా మారడంతో అతను అప్పటి వరకు అనుభవించిన ఆనందం మొత్తం ఆవిరైంది. కనీసం ఈ కొత్త కారుని ఇంకా ఇంటికి కూడా తీసుకుపోలేదు. కొని అరగంట కూడా కాలేదు.. అంతలోనే ఇంతటి వైపరీత్యామా అంటూ తెగ కుమిలిపోయాడా వ్యక్తి. అలానే పోలీసులకి కంప్లయింట్‌ చేశాడు.. పోలీసులు మాత్రం తిన్న గా ఉండక ప్రమాదానికి గురైన ఆ కారు ఫోటోను సోషల్‌ మీడియా లో పెట్టారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది.