Begin typing your search above and press return to search.

సీఎం జగన్.. ఆ మాత్రం భద్రత ఉండాల్సిందే..

By:  Tupaki Desk   |   24 May 2019 7:51 AM GMT
సీఎం జగన్.. ఆ మాత్రం భద్రత ఉండాల్సిందే..
X
మొన్నటివరకు ప్రజలే బాడీ గార్డులు.. కొందరు ప్రైవేటు వ్యక్తులను జగన్ తన సెక్యూరిటీగా పెట్టుకునేవాడు. ప్రభుత్వం కల్పించిన వారితోపాటు జగన్ అనుయాయులు కూడా పాదయాత్రలో ఆయనవెంట 3వేల కి.మీలకు పైగా నడిచారు. కానీ ఇప్పుడు జగన్ ప్రతిపక్ష నేత కాదు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎం.. 30న గద్దెనెక్కబోతున్నాడు. అందుకే జగన్ కు అత్యాధునిక వ్యవస్థలతో ఫుల్ టైట్ సెక్యూరిటీని కల్పించేందుకు ఏపీ పోలీసులు డిసైడ్ అయ్యారు.

ఇక రాజీనామా చేసిన చంద్రబాబు తన మాందీ మార్బలం.. మార్యదలు, భద్రత కార్లు అన్నీ వదిలేసి వెళ్లిపోయారు. ఇప్పుడు కాబోయే సీఎం జగన్ కావడంతో అధికారులు జగన్ కు సెక్యూరిటీ పెంచారు.. జగన్ సీఎం ప్రమాణానికి ముందే సకల భద్రత చర్యలు చేపట్టడానికి రెడీ అయ్యారు.

కొత్త ముఖ్యమంత్రి జగన్ కోసం ఏపీ పోలీస్ డిపార్ట్ మెంట్ మరింత సెక్యూరిటీని పెంచి భద్రత కల్పించడానికి రెడీ అయ్యింది. అంతేకాదు జగన్ కోసం సరికొత్త కాన్వాయ్ ను సిద్ధం చేశారు. ఆరు కొత్త కార్లు జగన్ కాన్వాయ్ లో ఇక చేరబోతున్నాయి. అవన్నీ బుల్లెట్ ఫ్రూఫ్ కావడం విశేషం. ఇక ఆ ఆరు కార్లకు భద్రత దృష్ట్యా ఒకే నంబర్ ను కేటాయించారు. ఏపీ 18పీ 3418 పేరుతో ఆరు కార్లు జగన్ ప్రయాణంలో ఉంటాయి. జగన్ ఎక్కడికి వెళ్లినా ఈ కాన్వాయ్ ఇక ఆయన వెంట ఉండనున్నాయి.

జగన్ హైదరాబాద్ వెళ్లి గవర్నర్ నరసింహన్ ను కలవాలని నిర్ణయించుకున్నారు. మే 30న విజయవాడలో నిర్వహించే తన ప్రమాణ స్వీకారాన్ని చేయించాలని గవర్నర్ ను కోరనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది.

ఇక మాజీ సీఎంగా మారిపోయినా కానీ చంద్రబాబు జడ్ ప్లస్ సెక్యూరిటీని ప్రభుత్వం కల్పిస్తోంది. ఎందుకంటే ఆయన 2004లో మావోయిస్టుల దాడిలో గాయపడ్డారు.. హిట్ లిస్ట్ లో ఉన్నారు. దీంతో ఆయనకు భద్రత కొనసాగనుంది.