Begin typing your search above and press return to search.

ఈ లక్షణాలు ఉన్నాయా? అయితే మీకు తొందర్లనే బ్రెయిన్​ స్ట్రోక్​ ఖాయం..!

By:  Tupaki Desk   |   1 March 2021 4:44 AM GMT
ఈ లక్షణాలు ఉన్నాయా? అయితే మీకు తొందర్లనే బ్రెయిన్​ స్ట్రోక్​ ఖాయం..!
X
మనిషి శరీరంలో మెదడు ఎంతో కీలకమైనది. మెదడుకు ఏమైనా ఆరోగ్యపరంగా ఏమైనా సమస్యలు వచ్చాయంటే ఎదుర్కోవడం చాలా కష్టం. బ్రెయిన్​ స్ట్రోక్​ అయితే ఎంతో ప్రమాదకరమైన స్థితి. మెదడులోని కొన్ని భాగాలకు రక్త సరఫరా నిలిచిపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ముందస్తుగా వచ్చే కొన్ని లక్షణాలను గుర్తిస్తే ఈ స్థితి నుంచి తప్పించుకోవచ్చని డాక్టర్లు అంటున్నారు. బ్రెయిన్​ స్ట్రోక్​ వచ్చేకంటే నెల ముందు మన శరీరంలోని ఎటువంటి మార్పులు జరుగుతాయో.. ఎటువంటి లక్షణాలు ఏర్పడతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ముఖం, చేతులు, కాళ్లు మొద్దుబారతాయి.. ఇది ఓ సాధారణ లక్షణమే అయితే బ్రెయిన్​ స్ట్రోక్​కు ముందుకూడా ఇలా జరిగే ప్రమాదం ఉంది. తరచూ ఎక్కిళ్లు పట్టడం.. ఇది కూడా బ్రెయిన్​ స్ట్రోక్​ ముందు కనిపించే లక్షణమని వైద్య నిపుణులు నిర్వహించిన ఓ సర్వేలో తేలింది.కంటిచూపు మందగిస్తుంది. తల వెనకభాగంలో ఒకొక్కసారి నొప్పి వస్తుంది. ఒక్కోసారి స్పృహకూడా కోల్పోయే అవకాశం ఉంది.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటం జరుగుతుంది. మతిమరుపు బాగా పెరుగుతుంది.. ఉన్నట్టుండి పాత విషయాలు అన్ని మరిచిపోవడం.. పేర్లు మరిచిపోవడం.. ఇది బ్రెయిన్​ స్ట్రోక్ వల్లే వచ్చే ఓ మానసిక లక్షణం. వాంతులు.. వికారంగా ఉండటం అధిక రక్తపోటు కూడా బ్రెయిన్​ స్ట్రోక్​కు ముందు గుర్తించే ఓ సమస్య అని అంటున్నారు డాక్టర్లు. మహిళల్లో గర్భస్రావాలు కూడా జరగొచ్చని అంటున్నారు.