Begin typing your search above and press return to search.

వైరల్: మరుగుదొడ్లకు కులపిచ్చి అంటగట్టారు!

By:  Tupaki Desk   |   7 March 2020 11:04 AM IST
వైరల్: మరుగుదొడ్లకు కులపిచ్చి అంటగట్టారు!
X
చాలా నగరాల్లో ఇల్లు అద్దెకు తీసుకునేందుకు మొదట అడిగేది ‘మీ కులం ఏంటి?’ అని అల్ప కులాల వారికి ఇల్లు అద్దెకివ్వరు. ఇక పెళ్లి చేయడానికి కులం కీలకం. వేరే కులపోళ్లను అస్సలు పెళ్లి చేసుకోరు. దేశం అభివృద్ధిలో దూసుకుపోతున్నా ఇంకా కులజాఢ్యం వదలడం లేదు. కంప్యూటర్ యుగంలో కూడా కట్టుబాట్లు , కులపిచ్చి తగ్గడం లేదు. కులాల కుంపట్లలో మనుషులు దూరమైపోతున్నారు.

తాజాగా మరో కులజాడ్యం బయట పడింది. దేవాలయం లో బ్రాహ్మణుల కోసం ప్రత్యేక టాయ్ లెట్ అని రాసిపెట్టడం తీవ్ర దుమారం రేపింది. కేరళలో చోటుచేసుకున్న ఈ ఘటన వైరల్ గా మారింది.

కేరళలోని కుట్టుముక్కు మహాదేవ ఆలయంలో ఓ మూల ఉన్న టాయిలెట్ల వద్ద ‘ఈ మరుగుదొడ్డి బ్రాహ్మాణులకు మాత్రమే’నని రాసి ఉండడం చూసి భక్తులు ముక్కున వేలేసుకున్నారు.

ఇది చూసి పీహెచ్ డీ విద్యార్థి అరవింద్ సోషల్ మీడియాలో అది పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. ఇది స్థానికంగా పెద్ద వివాదానికి దారితీసింది. స్పందించిన కొచ్చిన దేవాలయం బోర్డు దీనిపై విచారణకు ఆదేశించింది. ఆ తర్వాత టాయ్ లెట్లపై బోర్డును తొలగించారు. ఇలా మరుగుదొడ్లకు కులపిచ్చి అంటగట్టిన అయ్యగార్ల పై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.