Begin typing your search above and press return to search.

3 నెలల్లో మంగళగరిని మార్చేస్తారంటున్న బ్రాహ్మణి

By:  Tupaki Desk   |   9 April 2019 11:51 AM IST
3 నెలల్లో మంగళగరిని మార్చేస్తారంటున్న బ్రాహ్మణి
X
తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కుమారుడు లోకేశ్ కు దన్నుగా ప్రచారగోదాలోకి దిగారు ఆయన సతీమణి బ్రాహ్మణి. మొదట్లో చాలా ఈజీ టార్గెట్ అనుకున్నప్పటికీ.. గెలుపు అనుకున్నంత ఈజీ కాదన్న విషయాన్ని గుర్తించిన తెలుగుదేశం శ్రేణులు ఇప్పుడు బ్రాహ్మణిని సైతం ప్రచార గోదాలోకి దించారు.

తన మాటలతో కామెడీగా మారిన లోకేశ్ స్పీచులకు భిన్నంగా.. బ్రాహ్మణి వాయిస్ తో కాస్తంత సీరియస్ నెస్ తీసుకురావాలని తలచిన బాబు.. కోడలి చేత ప్రచారాన్ని చేయిస్తున్నారు. ప్రజల్లోకి వచ్చి మాట్లాడటం కొత్తే అయినప్పటికీ.. తడబాటు లేకుండా తన ప్రచారాన్ని సాగిస్తున్నారు బ్రాహ్మణి.

తన భర్తను గెలిపిస్తే మంగళగిరి నియోజకవర్గానికి చేసే మేలు గురించి అదే పనిగా చెబుతున్న బ్రాహ్మణి మాటలు ఆసక్తికరంగా మారాయి. ప్రభుత్వ పథకాలను.. తన భర్త లోకేశ్ కష్టాన్ని.. ఎన్నికల సందర్భంగా పార్టీ ఇస్తున్న హామీలను.. అదే పనిగా చెబుతున్న బ్రాహ్మణి.. టీడీపీ సర్కారు చేపట్టిన పనుల్ని ఏకరువు పెడుతున్నారు.

లోకేశ్ ను గెలిపిస్తే.. మూడునెలల వ్యవధిలో మంగళగిరి దశను మార్చేస్తానని చెబుతున్న బ్రాహ్మణికి ఒక ప్రశ్న. అంత సింఫుల్ గా చేసేటట్లైయితే.. మూడు నెలల్లో మంగళగిరి రూపురేఖలు మార్చేసి.. ఓట్లు అడిగేందుకు వస్తే సరిపోయేది కదా? డెవలప్ చేయటం అంత వీజీగానా బ్రాహ్మణి. అదే నిజమైతే.. ఐదేళ్లలో చంద్రబాబు చాలా చేయాలిగా.. ఏమీ కనిపించట్లేదు ఎందుకంటారు?