Begin typing your search above and press return to search.
బ్రహ్మంగారి మఠం వివాదం .. ఇక నిర్ణయం ధార్మిక పరిషత్, దేవాదాయశాఖ చేతుల్లోనే !
By: Tupaki Desk | 24 Jun 2021 2:00 PM ISTఆంధ్రప్రదేశ్, కడప జిల్లాలోని ,కాలజ్ఞానం రచయిత బ్రహ్మంగారి మఠం నూతన పీఠాధిపతి వ్యవహారం ఇప్పట్లో ఓ కొలిక్కి వచ్చేటట్టు కనిపించడం లేదు. బ్రహ్మంగారి మఠం మఠాధిపతి శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి పరమపదించిన తర్వాత, ఆయన వారసత్వంగా పీఠం ఎవరు అధిష్ఠించాలన్నది పెద్ద ప్రశ్నగా మారింది. తానే నూతన పీఠాధిపతి పదవికి అర్హుడ్నని వెంకటేశ్వరస్వామి పెద్ద భార్య కుమారుడు వెంకటాద్రి, కాదు, తాను కూడా అర్హుడనే అంటూ రెండో కుమారుడు పట్టుకు కూర్చున్నాడు. ముఖ్యంగా, బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి అధికారాలు తనకు అప్పగించాలంటూ వెంకటేశ్వరస్వామి రెండో భార్య మహాలక్ష్మమ్మ కూడా రేసులో నిలిచారు.
దీనితో ఈ త్రిముఖ వివాదంలో ఏపీ ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటు, శివస్వామి వంటి ఇతర పీఠాధిపతులు కూడా రంగంలోకి దిగారు. ఇటీవల కొన్ని పరిణామాల నేపథ్యంలో సయోధ్య కుదిరి సమస్య ఓ కొలిక్కి వస్తుందనుకున్న తరుణంలో చర్చలు విఫలం అయ్యాయి. వెంకటేశ్వరస్వామి కుటుంబసభ్యులు ఈ అంశంపై అందరూ కలిసి చర్చించుకుని వస్తే పీఠాధిపతిపై నిర్ణయం తీసుకుంటామని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రతిపాదన చేశారు. ఇదే అంశంలో ఆయన వెంకటాద్రి స్వామితోనూ, రెండో భార్యతోనూ చర్చించారు. కానీ, తనకు పీఠాధిపతి పదవి ఇవ్వాలంటూ మొదటి భార్య రెండో కుమారుడు పట్టుదలకు పోతుండడంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది.
దీనితో పీఠాధిపతి ఎంపిక బాధ్యత ఇక ధార్మిక పరిషత్, దేవాదాయశాఖకు వెళ్లింది. జులై చివరి వారంలో దీనిపై ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. మఠం వ్యవహారాలను చక్కబెట్టేందుకు ప్రత్యేక అధికారిని నియమించింది ఏపీ దేవాదాయశాఖ. దీనితో రెండు రోజుల పాటు బ్రహ్మంగారి మఠాన్ని సందర్శిస్తారు దేవాదాయశాఖ జాయింట్ కమిషనర్ ఆజాద్. పీఠాధిపతి ఎంపికపై చర్యలు తీసుకుంటారు ఆజాద్. మఠంలో అవినీతి, అక్రమాలపై ఆరోపణలు వెల్లువెత్తడంతో రికార్డులను పరిశీలించనున్నారు. మరోవైపు పీఠాధిపతి ఎవరు ఉండాలనే దానిపై జులై నెల చివర్లో ధార్మిక పరిషత్ భేటీ అవుతుంది. 13 మంది మఠాధిపతులతో కమిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పుడు ధార్మిక పరిషత్, దేవాదాయశాఖ ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు, పీఠాధిపతి నియామకాన్ని త్వరగా తేల్చాలని ధార్మిక పరిషత్ ను రాష్ట్ర మంత్రి వెల్లంపల్లి ఆదేశించారు. పీఠాధిపతులతో సమావేశం నిర్వహించాలని మంత్రి వెల్లంపల్లి ఆదేశించారు. దీంతో ఎంపిక ప్రక్రియ మరింత వేగవంతం అయ్యే అవకాశం ఉంది. తాజాగా మఠం మేనేజర్ ఈశ్వరాచారి ఆకస్మిక సెలవుపై వెళ్లారు. నేటి నుంచి నెల రోజుల పాటు సెలవు పెట్టి వెళ్లారు ఈశ్వరాచారి.
బ్రహ్మంగారి మఠం 11వ పీఠాధిపతిగా కొనసాగిన శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి కొన్నాళ్ల కిందట కన్నుమూశారు. ఆయనకు పెద్ద భార్య చంద్రావతమ్మ ద్వారా నలుగురు కుమారులు, రెండో భార్య మహాలక్ష్మమ్మ ద్వారా ఇద్దరు పిల్లలు కలిగారు. పెద్ద భార్య మరణానంతరం వెంకటేశ్వరస్వామి 63 ఏళ్ల వయసులో 24 ఏళ్ల మహాలక్ష్మమ్మను రెండో పెళ్లి చేసుకున్నారు. మహాలక్ష్మమ్మ పెద్ద కొడుకు గోవిందస్వామి వయసు 9 ఏళ్లే కావడంతో, తన కుమారుడి మైనారిటీ తీరే వరకు తానే మాతృశ్రీ హోదాలో మఠం బాధ్యతలు నిర్వర్తిస్తానని మహలక్ష్మమ్మ వాదిస్తున్నారు. ఆ మేరకు తమ వద్ద వీలునామా కూడా ఉందని ఆమె చెబుతున్నట్టు తెలుస్తోంది.