Begin typing your search above and press return to search.

మానవులను కాటేస్తున్న బీపీ, షుగర్

By:  Tupaki Desk   |   28 Aug 2021 2:30 PM GMT
మానవులను కాటేస్తున్న బీపీ, షుగర్
X
నిత్యం బిజీ లైఫ్.. టెన్షన్ వాతావరణం.. కాలుష్యం...ఇవన్నీ మానవుని ఆయుష్సును తగ్గిస్తున్నాయి. రోజు రోజుకు మనిషి జీవనంలో మార్పులు చోటు చేసుకుండడంతో జీవన మనుగడ కష్ట సాధ్యమవుతుంది. కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తుండడంతో వాటిని తట్టుకోలేక సగటు మానవుడు దీర్ఘకాలంగా జీవనాన్ని కొనసాగించలేకపోతున్నాడు. ఇటీవల విడుదలయిన జాతీయ ఆరోగ్య ముఖచిత్రం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లోని ఆరోగ్య పరిస్థితిని గమనిస్తూ భయం పుట్టుకొస్తోంది. రెండు రాష్ట్రాల్లోనూ సుఖ వ్యాధులతో బాధపడేవారు అధికంగానే ఉన్నట్లు వెల్లడైంది.

టైఫాయిడ్, డెంగీ , డయేరియా కేసులు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నాయి. అయితే మలెరియా కేసులు తగ్గడం ఒకింత ఊరటనిస్తోంది. 2015లో తెలంగాణలో 10, 951 మలేరియా కేసులు నమోదు కాగా..ఆంధ్రప్రదేశ్లో 25,042 నమోదయ్యాయి. ఈ సంఖ్య 2019 నాటికి భారీగా తగ్గింది. 2019లో తెలంగాణలో 1,711 ఉండగా.. ఏపీలో 3,104 నమోదైంది. మలేరియా కేసుల విషయంలో కొంచెం ఊరట కలిగించినా డెంగీ విషయంలో మాత్రం ఆందోళన కలిగిస్తోంది. 2019 నివేదిక ప్రకారం దేశంలో గుజరాత్ లో అత్యధికంగా 17,415 డెంగీ కేసులు నమోదయ్యాయి. 17 మంది మరణించారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే 2019 ప్రకారం.. ఏపీలో 5,286.. తెలంగాణలో 110 డెంగీ కేసులు నమోదయ్యాయి.

వాతావరణ మార్పుల కారణంగా వైరల్ ఫీవర్ ఎక్కువైంది. దీంతో ప్రాంతాల వారీగా వ్యాధులు వస్తున్నాయి. ఈ క్రమంలో టైపాయిడ్ తో చాలా మంది బాధపడుతున్నారు. దేశంలో అత్యధికంగా 2019 ప్రకారం.. ఉత్తరప్రదేశ్లో 8,54,331 మంది టైపాయిడ్ తో బాధపడ్డారు. వీరిలో 225 మంది మరణాలు సంభవించాయి. ఏపీలో 1,59,415 మందికి టైపాయిడ్ సోకగా 3 మరణాలు జరిగాయి. తెలంగాలో 1,04, 456 కేసులు నమోదు కాగా ఒకరు చనిపోయారు. అయితే కలుషిత నీరు, ఫుడ్ ఫాయిజన్తో ఈ వ్యాధి సంక్రమిస్తున్నట్లు ఆరోగ్య నివేదిక తెలుపుతోంది.

మరోవైపు బ్లడ్ ఫ్రెషర్ రేటు విషయంలో మరింత ఆందోళన కలిగిస్తోంది. జాతీయ ముఖచిత్ర ప్రకారం.. తెలగాణలో 15.52, ఆంధ్రప్రదేశ్లో 22.88 శాతం మంది బీపీ తో బాధపడుతున్నారు. ఇక డయాబెటీస్ విషయానికొస్తే ఏపీలో 23.10 శాతం, తెలంగాణలో 6.69 శాతంగా నమోదైంది. ఈ విషయంలో తెలంగాణ కంటే ఏపీలో మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్నారు.

దేశంలో డయేరియా కూడా చాపకింద నీరులా పాకుతోంది. కొన్ని ప్రాంతాల్లోని అపరిశుభ్రతే ఈ వ్యాధి విజృంభిచడానికి కారణమని తెలుస్తోంది. దేశంలో అత్యధికంగా పశ్చిమ బెంగాల్ లో డయేరియా కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో 22,10, 428 మంది ఈ వ్యాధి బారిన పడగా 141 మంది ప్రాణాలు విడిచారు. ఆ తరువాత ప్లేసులో ఉత్తరప్రదేశ్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనూ డయేరియా మరణాలు అధికంగానే ఉన్నాయి. ఏపీలో 11,38, 437 మందికి ఈ వ్యాధి నిర్దారణ కాగా 118 మంది చనిపోయారు. తెలంగాణలో 4,93,216 మందికి డయేరియా రాగా 4గురు మరణించారు.

వ్యాధులే కాకుండా వేర్వేరు సంఘటనలతో ప్రతీ సంవత్సరం మరణించేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. మహిళలతో పోలిస్తే పురుషుల్లో ఈ సంఖ్య అధికంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో 3,751 మంది పురుషులు ఆత్మహత్య చేసుకోగా... 1,566 మంది మహిళలు బలవన్మరణానాకి పాల్పడ్డారు. పురుషుల్లో 18 నుంచి 30 ఏళ్ల వారు 1,181 మంది ఉండడం ఆందోళన కలిగిస్తోంది. మహిళల్లో ఈ సంఖ్య 766 మంది ఉన్నారు. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రంలో ఆత్మహత్యలు ఎక్కువగా నమోదయ్యాయి.ఇక్కడ 13,497 మంది ఆత్మహత్య చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్ లో 359 మంది మగవారు ఆత్మహత్య చేసుకోగా.. 177 మంది మహిళలు బలవన్మరణానికి పాల్పడ్డారు.