Begin typing your search above and press return to search.

రాష్ట్రంలో నలుగురిలో ఒకరికి బీపీ ... ఐదుగురిలో ఒకరికి షుగర్‌ !

By:  Tupaki Desk   |   17 July 2021 11:30 AM GMT
రాష్ట్రంలో నలుగురిలో ఒకరికి బీపీ ... ఐదుగురిలో ఒకరికి షుగర్‌ !
X
ఆంధ్రప్రదేశ్ లో జీవన శైలి జబ్బులైన బీపీ, షుగర్‌ లు చాపకింద నీరులా వ్యాప్తి చెందుతున్నాయి. ఇంతకముందు పట్టణాల్లోనే ఎక్కువగా కనిపించిన ఈ జబ్బులు ఇప్పుడు పల్లెల్లోనూ వ్యాప్తి చెందుతున్నాయి. రాష్ట్రంలో ప్రతి నలుగురిలో ఒకరికి బీపీ, 30 ఏళ్లు నిండిన ప్రతి ఐదుగురిలో ఒకరికి షుగర్‌ ఉందంటే పరిస్థితి ఏ రేంజ్ లో ఉందొ అంచనా వేయొచ్చు. గ్రామాల్లో 26 శాతం మంది, పట్టణాల్లో 30 శాతం మంది బీపీ బాధితులు, పల్లెల్లో 19 శాతం మంది, పట్టణాల్లో 24 శాతం షుగర్‌ బాధితులున్నట్టు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో 20.5 శాతం మంది షుగర్‌ బాధితులు ఉన్నారు. అయితే, ఈ స్థాయిలో బీపీ, షుగర్‌ బాధితులుండటం అత్యంత ఆందోళన కలిగించే అంశమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అవగాహన లేక కొందరు, నిర్లక్ష్యంతో మరికొందరు ఈ రెండు ప్రమాదకర జబ్బులను నియంత్రణలో ఉంచుకోలేక గుండెజబ్బుల బారిన పడుతున్నారు.

నియంత్రణకు చర్యలు :
1. జీవనశైలి జబ్బులు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలను ముమ్మరం చేసింది.
2. వారానికోసారి ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో ఎన్‌ సీడీ (జీవనశైలి జబ్బులు) స్క్రీనింగ్‌ నిర్వహిస్తోంది.
3. 104 వాహనాల ద్వారా కూడా స్క్రీనింగ్‌ నిర్వహించి ఉచితంగా మందులిస్తోంది.
4. 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ ఉచితంగా స్క్రీనింగ్‌ చేస్తున్నారు. ఈ వయసు దాటిన వాళ్లు తరచూ బీపీ, షుగర్‌ పరీక్షలు
చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

వ్యాయామం లేకే ఈ దుస్థితి .. ఒత్తిడి కారణంగా ఈ జబ్బులొస్తున్నాయి. వ్యాయామం లేదు, సరైన ఆహారమూ తీసుకోవడం లేదు. పిల్లలు ఎలక్ట్రానిక్‌ పరికరాల ప్రభావానికి లోనవుతున్నారు. దీన్నుంచి బయటపడాలంటే వారిని క్రీడల వైపు మళ్లించాలి. పెద్దవాళ్లు యోగా చేయాలి. శారీరక వ్యాయామం లేకుంటే చిన్న వయసులోనే ఈ జబ్బులు వచ్చే అవకాశం ఉంది. ల్లలకు క్రీడల వైపు మొగ్గు చూపడం, పెద్దవాళ్లు యోగా చేయడం లాంటివి చేస్తే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. అలాగే శారీరక వ్యాయామం లేకుంటే చిన్న వయసులోనే ఈ జబ్బులు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

షుగర్‌ వ్యాధి ఉన్నవాళ్లు తినే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అదుపులో ఉంటుందంటున్నారు వైద్య నిపుణులు. షుగర్‌ ఉన్నవారు డైట్ లో పప్పు దినుసులు ఎక్కువగా ఉండేలా చూడాలి. పప్పు దినుసుల నుండి లభించే ప్రోటీనులు, మాంసాహారం నుండి లభించే ప్రోటీనుల కంటే మేలైనవి. పప్పు దినుసులు ప్రోటీన్, ఫైబర్ అధికంగా కలిగి ఉంటాయి. ఈ మూలకాలు రక్తంలోని చక్కర స్థాయిలు పెరగకుండా అడ్డుకుంటాయి. గోధుమ, రాగి తప్ప వరి అన్నము తినరాదు అన్నది తప్పు అభిప్రాయం. వరి, గోధుమ, రాగి జొన్నలు, సజ్జలు మొదలైన ధాన్యాలలోనూ 70 శాతం పిండి పదార్థం ఉంటుంది.

ఇక రక్తపోటు తగ్గటానికీ కొబ్బరినీరు ఎంతగానో ఉపయోగపడతాయంటున్నారు వైద్యులు. ఇందులో కేంద్ర నాడీవ్యవస్థను ప్రశాంతంగా ఉంచేందుకు, రక్తనాళాలు దెబ్బతినకుండా కాపాడేందుకు తోడ్పడే పొటాషియం అధికంగా ఉంటుంది. సుమారు 600 మిల్లీలీటర్ల కొబ్బరినీరుతో 1,500 మి.గ్రా. పొటాషియం లభిస్తుంది. సోడియం, పొటాషియం సమతౌల్యం కోసం శుద్ధి చేయని నల్ల ఉప్పు లేదా రాతి ఉప్పు వాడాలి. తెల్లని ఐయోడైజ్డ్‌ ఉప్పులో సోడియం మాత్రమే ఉంటుంది.

ఆ ఉప్పులో పొటాషియం ఉండదు. బాగా వేగించిన ఆహారపదార్ధాలు, ప్యాకేజ్డ్‌ ఫుడ్స్‌ పోషకాలను గ్రహించనీయవు. ఇంటి వద్ద తయారుచేసుకున్న పచ్చళ్లలో ఉండే ఆరోగ్యకర బ్యాక్టీరియా రక్తపోటును అదుపులో ఉంచడంలో సాయపడుతుంది. అలాగే రకరకాల చిరు, పప్పు ధాన్యాలతో తయారైన పాపడ్స్‌లోని నల్ల మిరియాలు, జీలకర్ర ఆరోగ్యానికి మంచి చేస్తాయి.