Begin typing your search above and press return to search.
ప్రియుడికి ఎయిడ్స్.. అయినా పెళ్లి చేసుకుంటానంటోంది
By: Tupaki Desk | 26 Jan 2021 12:00 PM ISTఎయిడ్స్ నిర్దారణ అయిన వ్యక్తితో కలిసి జీవించేందుకు సిద్ధమైన ఒక అమ్మాయి ఉదంతం ఇప్పుడు చర్చగా మారింది. అంతేకాదు.. ఇంట్లో వారికి తెలీకుండా పెళ్లి చేసుకున్న వైనం సంచలనంగా మారింది. తమిళనాడులో చోటు చేసుకున్న ఈ ఘటనలోకి వెళితే.. కన్నియకుమారి జిల్లాలోని ఒక గ్రామానికి చెందిన 17ఏళ్ల మైనర్.. నాగర్ కోయిల్ లోని ఒక ప్రైవేటు కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది.
రెండు రోజులుగా తమ కుమార్తె కనిపించటం లేదన్న తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగారు పోలీసులు. వారి విచారణలో షాకింగ్ నిజం బయటకు వచ్చింది. ఇంట్లో వారికి తెలీకకుండా.. కోవైలోని స్నేహితుల వద్దకు వెళ్లిన సదరు బాలిక..ఎయిడ్స్ నిర్దారణ అయిన ఒక ఆటో డ్రైవర్ ను పెళ్లి చేసుకున్నట్లుగా గుర్తించారు. అయితే.. అమ్మాయి మైనర్ కావటంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ వ్యవహారంలో ఆటో డ్రైవర్ పైన ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రియుడి అరెస్టును నిరసిస్తూ.. సదరు బాలిక రోడ్డు మీద బైఠాయించి.. తనను కూడా అరెస్టు చేయాలంటూ నిరసనకు దిగింది. ఆమెకు ఎయిడ్స్ సోకిందేమోనన్న విషయాన్ని కన్ఫర్మ్ చేసేందుకు ఆమెను అదుపులోకి తీసుకొని.. పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.