Begin typing your search above and press return to search.

బాబుకు 100మార్కులు వెయ్యొచ్చన్న బొత్స!

By:  Tupaki Desk   |   26 Dec 2016 10:16 AM GMT
బాబుకు 100మార్కులు వెయ్యొచ్చన్న బొత్స!
X
ఏపీ వాసులు పెట్టుకున్న భారీ నమ్మకాల నడుమ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు.. కాలం గడిచే కొద్దీ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో సక్సెస్ కాలేకపోతున్నారనే విమర్శలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి అనేది రాజకీయ సర్కిల్స్ లో ఈమధ్య కాలంలో బలంగా వినిపిస్తున్న కామెంట్!! ఆ విషయం కాసేపు పక్కనపెడితే తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు వైఎస్‌ ఆర్ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ. వ్యవసాయం - ప్రాజెక్టులు - పరిశ్రమలు వంటి మూడు ముఖ్యమైన రంగాల్లో కనీసం ఒక్కశాతం అభివృద్ది కూడా జరగలేదని మొదలుపెట్టిన బొత్స... ఆయా రంగాల్లో ముఖ్యమైన విషయాలను ప్రస్థావిస్తూ బాబుపై ఫైరయ్యారు.

రోజు రోజుకీ అవినీతి లోతుల్లో కూరుకుపోతున్న ఏపీ ప్రభుత్వ పాలన 2016 ఏడాదిలో మరింత దారుణంగా తయారయ్యిందని, అవినీతి పాలనకు చంద్రబాబుకు 100 మార్కులు వేయొచ్చని బొత్స ధ్వజమెత్తారు. ఈ సమయంలో టీడీపీ నేతలపై ఫైరయిన బొత్స... రాష్ట్రంలో పంచభూతాలను పంచుకుతింటున్నారని, రాష్ట్రంలో ఐదుశాతం వృద్ది రేటు ఉంటే దాన్ని 12% అని తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని... ఈ విషయంలో బహిరంగ చర్చకు తాను సిద్దమని అధికార పక్షానికి సవాల్ విసిరారు. ప్రభుత్వ ప్రకటించిన వృద్ది రేటు టీడీపీ నేతల ఆర్ధిక విషయంలో పెరిగింది తప్ప సామాన్య ప్రజల విషయంలో కాదని ఎద్దేవా చేశారు బొత్స. ఇంకా గట్టిగా చెప్పాలంటే రాష్ట్రంలో పెరిగింది వృద్ది రేటు కాదు, క్రైమ్ రేటు అని అన్నారు.

ఇదే సమయంలో టీడీపీ నేతలు, మంత్రుల ప్రవర్తనపై వస్తున్న వార్తలపై కూడా బొత్స స్పందించారు. మహిళా ప్రజాప్రతినిధిని మంత్రి రావెల కిశోర్‌ బాబు వేధిస్తే చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారని ప్రశ్నించిన బొత్స... పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని సవాల్‌ విసిరారు. అయితే ఈ కామెంట్స్ పై టీడీపీ నేతలు సమాధానాలతో స్పందిస్తారా లేక రెగ్యులర్ గా ఎదురు విమర్శలకే పరిమితమవుతారా అనేది వేచి చూడాలి!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/