Begin typing your search above and press return to search.

జ‌గ‌న్‌, చంద్ర‌బాబు ఇద్ద‌రికీ ఆ విష‌యంలో ``హ్యాట్సాఫ్‌``

By:  Tupaki Desk   |   26 April 2021 9:00 AM IST
జ‌గ‌న్‌, చంద్ర‌బాబు ఇద్ద‌రికీ ఆ విష‌యంలో ``హ్యాట్సాఫ్‌``
X
అదేంటి? నిత్యం విమ‌ర్శ‌లు, ప్ర‌తివిమ‌ర్శ‌లు, హాట్ హాట్ కామెంట్ల‌తో విరుచుకుప‌డే అధికార పార్టీ వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్‌, ప్ర‌తిప‌క్ష నేత‌, టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు ఒకేసారి ఒకే విష‌యంలో ``హ్యాట్సాఫ్‌`` చెప్ప‌డం ఏంటి? అనుకుంటున్నారా? ప‌ర‌మ ప్ర‌త్య‌ర్థులైన ఇద్ద‌రూ ఒక విష‌యంలో ఒకే విధంగా వ్య‌వ‌హ‌రించారా? అని భావిస్తున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. రాజ‌కీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండ‌వు క‌దా?! అలానే ప్ర‌త్య‌ర్థులు కూడా ఎప్ప‌డూ ఒకేలా ఉండ‌రు.

ఇటీవ‌ల ముగిసిన తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక‌లో జ‌గ‌న్‌, చంద్ర‌బాబు ఇద్ద‌రూ ఒక నిర్ణ‌యం తీసుకు న్నార‌ని.. ప్ర‌స్తుతం ఉన్న ట్రెండ్‌ను మార్చాల‌ని భావించార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇది హ‌ర్షించ ద‌గ్గ ప‌రిణామ‌మ‌ని కూడా పేర్కొంటున్నారు. తిరుపతి ఉప పోరులో ఓట‌ర్ల‌కు ఈ రెండు పార్టీలు కూడా ఒక్క రూపాయి కూడా పంపిణీ చేయ‌లేదు. కానీ, ఇప్పుడున్న ట్రెండ్ ప్ర‌కారం ఓట‌ర్ల‌కు డ‌బ్బులు పంచ‌డ‌మే! కానీ, దీనికి టీడీపీ వైసీపీలు ఫుల్ స్టాప్ పెట్టాయ‌ని చెబుతున్నారు.

కానీ, వలంటీర్ల‌కు మాత్రం ఐదు వేల రూపాయ‌లు ఇచ్చారు త‌ప్ప‌.. ఓట‌ర్ల‌కు ఒక్క పైసా కూడా ఇవ్వ‌లేద‌ట‌. అదేవిధంగా.. టీడీపీ కూడా బూత్ కు రూ.5 వేలు చొప్పున ఇచ్చింద‌ట‌. వాస్త‌వానికి ఇది ఎవ‌రైనా ఇచ్చేదే. సో.. ఇది కూడా పెద్ద విష‌యం కాదు. ఇక‌, ఓట‌ర్ల విష‌యానికి వ‌స్తే.. టీడీపీ ఒక్క రూపాయి కూడా పంచ‌లే దు. ఇక‌, ఇదే ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ.. ఒక్క‌రూపాయి కూడా పంచ‌దు క‌నుక‌.. దాని గురించి పెద్ద‌గా చ‌ర్చ రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ఇక, తిరుప‌తిలో వైసీపీ, టీడీపీ రెండు పార్టీలు అనుస‌రించిన విధానంపై మేధావులు అభినంద‌న‌లు తెలు పుతున్నారు. ఎందుకంటే.. రాష్ట్రంలో ఏ ఎన్నిక వ‌చ్చినా.. ఓట‌ర్ల‌కు రూపాయి కూడా పంచ‌కుండా ఉంటే.. వారి యాట్టిట్యూడ్‌లో మార్పు రావ‌డంతోపాటు.. నిజ‌మైన నాయ‌కులు గెలుపుగుర్రం ఎక్కేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని భావిస్తున్నారు. ఇది మ‌రో ర‌కంగా.. ప్ర‌జాస్వామ్యాన్ని బ‌తికించిన‌ట్టేన‌ని అంటున్నారు.

అయితే.. ఇక్క‌డ మ‌రో విష‌యం చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఇంత నిజాయితీగా ఉన్న‌ప్ప‌టికీ.. వైసీపీ నాయ‌కులు పోలింగ్ రోజు దొంగ ఓట్ల దందాకు తెర‌దీశార‌నే ప్ర‌చారం జ‌రిగింది. అప‌వాదు కూడా ప‌డింది. మ‌రి దీని ప్ర‌భావం ఉందా? అంటే.. పె ద్ద‌గా ఉండ‌ద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. అస‌లు జ‌రిగిన పోలింగ్ శాతాన్ని చూసుకుంటే.. గ‌త 2019 ఎన్నిక‌ల‌తో పోల్చుకుంటే తిరుప‌తి ప‌రిధిలో 20 శాతం పోలింగ్ త‌గ్గిపోయింద‌ని చెబుతున్నారు. అయిన‌ప్ప‌టికీ ఫ‌ర్వాలేద‌ని.. ఓటు కోసం డ‌బ్బులు పంచే సంస్కృతికి అడ్డుక‌ట్ట వేయ‌డ‌మే మంచిద‌ని అంటున్నారు. ఈ ప‌రిణామం ముందుముందు మంచి చేస్తుంద‌ని మేధావులు భావిస్తున్నారు.