Begin typing your search above and press return to search.
వ్యాక్సిన్ పై కీలక వ్యాఖ్యలు చేసిన బోరిస్ జాన్సన్
By: Tupaki Desk | 3 Dec 2020 1:15 PM ISTకరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది. ఫైజర్ వ్యాక్సిన్ వచ్చే వారం నుండి సాధారణ ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకుని రాబోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాక్సిన్ ను ఇప్పట్లో అందరికీ అందజేయలేమని స్పష్టం చేశారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ చిట్టచివరి వ్యక్తి వరకూ దాన్ని పంపిణీ చేయడానికి కొన్ని నెలల సమయం పట్టొచ్చని తెలిపారు.
కరోనాను నిర్మూలించడానికి ఫైజర్ వ్యాక్సిన్ కు అనుమతి ఇచ్చిన అనంతరం బోరిస్ జాన్సన్, దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కరోనా ఆర్థిక సంక్షోభ పరిస్థితులకు దారి తీసిందని, ఆర్థిక రంగం పురోగమింపజేయడానికి కొన్ని కీలక నిర్ణయాలను తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. కరోనా వ్యాప్తి చెందుతోన్నప్పటికీ, ఆంక్షలను తొలగించాల్సి వచ్చిందని అన్నారు. కరోనా వ్యాప్తిని నివారించడానికి అమల్లోకి తీసుకొచ్చిన ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు బోరిస్ జాన్సన్ తెలిపారు. ప్రజలు ఆంక్షలను మాత్రమే ఎత్తేశామని, శానిటైజైషన్ ను కొనసాగిస్తున్నామని చెప్పారు.
ఫైజర్ వ్యాక్సిన్ వినియోగానికి తమ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, ఇప్పటికిప్పుడు ప్రతి ఒక్కరికీ దాన్ని అందించడం కష్టం అవుతుంది అని, వ్యాక్సిన్ ను రవాణా చేయడం సవాళ్లతో కూడుకున్న అంశమని , లాజిస్టిక్ సమస్యలను అధిగమించాల్సి ఉందని, దీనికోసం సమగ్ర బ్లూప్రింట్‌ను సిద్ధం చేస్తున్నామని అన్నారు. వ్యాక్సిన్ ను మైనస్ 70 డిగ్రీల వద్ద నిల్వ ఉంచి, రవాణా చేయాల్సి ఉంటుందని, ఆ తరువాత కూడా దాన్ని అదే ఉష్ణోగ్రతలో నిల్వ చేయడం సవాల్ గా మారిందని చెప్పారు. వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతోనే కరోనా వైరస్‌పై తాము సాగిస్తోన్న యుద్ధం ముగిసిపోయినట్టుగా భావించొద్దని బోరిస్ జాన్సన్ సూచించారు. కరోనా బారి నుంచి బయటపడటానికి ప్రతి ఒక్కరు మూడువారాల వ్యవధిలో రెండు ఇంజెక్షన్లను వేయించుకోవాల్సి ఉంటుందని చెప్పారు.