Begin typing your search above and press return to search.

బూస్టర్ డోస్.. క్రాస్ వ్యాక్సిన్ లేదు.. ఎందుకంటే?

By:  Tupaki Desk   |   10 Jan 2022 6:10 AM GMT
బూస్టర్ డోస్.. క్రాస్ వ్యాక్సిన్ లేదు.. ఎందుకంటే?
X
చూస్తుండగానే ముంచుకొచ్చిన మూడో వేవ్ వేళ.. బూస్టర్ డోస్ ఇచ్చే కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి షురూ చేస్తున్న సంగతి తెలిసిందే. బూస్టర్ డోసును ప్రస్తుతానికి ఎంపిక చేసిన వర్గాలకు మాత్రమే వేస్తున్నారు. అయితే.. ఈ సందర్భంగా బోలెడన్ని సందేహాలు చుట్టుముట్టేస్తున్న పరిస్థితి. ఒకవైపు మూడో వేవ్.. మరోవైపు ఒమిక్రాన్ కేసులు ఎక్కువ అవుతున్న వేళ.. ఫ్రంట్ లైన్ వర్కర్లకు.. హెల్త్ కేర్ వర్కర్లతో పాటు 60 ఏళ్లకు పైబడిన పెద్దవయస్కులకు బూస్టర్ డోసుల్ని ఈ రోజు (సోమవారం) నుంచి షురూ చేస్తున్నారు.

ఈ బూస్టర్ డోసును ప్రభుత్వం ప్రకటించిన వర్గాలకు చెందిన వారంతా తక్షణం వేయించుకోవాలి. ఇంతకీ బూస్టర్ డోస్ అంటే.. టీకా తీసుకున్న తర్వాత దాని నుంచి లభించే రక్షణ తగ్గుతుందని భావించినప్పుడు.. అదనంగా ఇచ్చే టీకాను బూస్టర్ డోసుగా చెబుతారు. ఒమిక్రాన్ వేళ.. చాలా దేశాల్లో బూస్టర్ డోసుల్ని ఇస్తున్నారు. కొన్ని దేశాల్లో అయితే.. నాలుగో డోసు కూడా ఇచ్చేస్తున్న పరిస్థితి. ఆ లెక్కన మన దగ్గర నడుస్తోంది మూడో డోసు మాత్రమే.

ఇంతకీ బూస్టర్ డోసు కింద ఏ టీకాను తీసుకోవాలి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఈ మధ్య వరకు క్రాస్ వ్యాక్సిన్ మీద బోలెడంత చర్చ జరిగింది. అంటే.. మొదటి.. రెండు డోసుల్లో కొవిషీల్డ్ టీకా వేసుకుంటే.. మూడో డోస్ కింద కొవాగ్జిన్ వేయించుకోవచ్చని. కానీ.. ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయించిన దాని ప్రకారం.. క్రాస్ వ్యాక్సిన్ కాకుండా.. మొదటి రెండు టీకాలు దేన్ని వేసుకున్నారో.. దాన్నే మూడో టీకా కింద వేసుకోవాల్సి ఉంటుంది.

టీకా తీసుకున్న తర్వాత అరగంట పాటు వ్యాక్సినేషన్ సెంటర్ లోనే ఉండటం మంచిది. ఆ సమయంలో ఏదైనా సైడ్ ఎఫెక్టులు వస్తుంటే.. అక్కడి సిబ్బంది సమాచారం ఇవ్వాలి. అంతేకాదు.. డోసు వేసుకున్న రోజు మద్యం కానీ నాన్ వెజ్ కానీ తీసుకోకూడదు. సో.. బూస్టర్ డోసుకు వేళైంది. ప్రభుత్వం అర్హులుగా డిసైడ్ చేసిన వారంతా.. బూస్టర్ డోసును వీలైనంత త్వరగా వేయించుకోవాల్సిన అవసరం ఉంది.