Begin typing your search above and press return to search.

అల‌క‌బూనిన కేటీఆర్ స‌న్నిహితుడు!

By:  Tupaki Desk   |   7 Sep 2018 6:35 AM GMT
అల‌క‌బూనిన కేటీఆర్ స‌న్నిహితుడు!
X
టీఆర్ఎస్ అధినేత‌.. తెలంగాణ రాష్ట్ర అప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుమారుడు క‌మ్ మంత్రి కేటీఆర్ కు అత్యంత స‌న్నిహితుడి అల‌క అధికార పార్టీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కార్పొరేట‌ర్ గా గెలిచిన బొంతు రామ్మోహ‌న్ ను కేటీఆర్ తో ఉన్న‌సాన్నిహిత్యం పుణ్య‌మా అని హైద‌రాబాద్ మేయ‌ర్ గా మార్చేసింద‌ని చెప్పాలి.

అలాంటి ఆయ‌న క‌న్ను ఇప్పుడు ఉప్ప‌ల్ అసెంబ్లీ స్థానం మీద ప‌డ‌టం.. తాజాగా వెల్ల‌డించిన అభ్య‌ర్థుల జాబితాలో ఉప్ప‌ల్ టీఆర్ ఎస్ అభ్య‌ర్థిగా భేతి సుభాష్ రెడ్డికి ఖ‌రారు చేయ‌టంపై తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన‌ట్లుగా చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తన‌కు ప‌ట్టున్న ఉప్ప‌ల్ అసెంబ్లీ నుంచి పోటీ చేయాల‌న్న ఆలోచ‌న మేయ‌ర్ బొంతుకు కొంత‌కాలంగా ఉన్న‌దే. ఇందులో భాగంగా ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గంపై ఆయ‌న కొంత‌కాలంగా ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌ను ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

ఇప్ప‌టికే టికెట్ ప్ర‌య‌త్నాల్లో భాగంగా మంత్రి కేటీఆర్ ముందు త‌న అభిలాష‌ను వ్య‌క్తం చేసిన‌ట్లుగా తెలుస్తోంది. ఆయ‌న నుంచి సానుకూల‌త వ్య‌క్తం కావ‌టంతో ఎమ్మెల్యే టికెట్ మీద ఆశ‌లు పెంచుకున్న‌ట్లుగా చెబుతున్నారు. ఇలాంటి వేళ‌.. త‌న‌కు కాకుండా వేరే వారికి టికెట్ ఇవ్వ‌టంపై ఆయ‌న మ‌న‌స్తాపానికి గురైన‌ట్లుగా తెలుస్తోంది. మ‌న‌సులో బాధ ఉన్నా.. ఆ విష‌యాన్ని చేరాల్సిన వారికి చేరేలా వ్య‌వ‌హ‌రించాల్సింది పోయి.. అందుకు భిన్నంగా త‌న చేత‌ల‌తో అంద‌రికి తెలిసేలా చేసిన తీరు ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

జీహెచ్ ఎంసీ స్టాండింగ్ క‌మిటీ స‌మావేశం గురువారం జ‌రిగింది. దీనికి బొంతు హాజ‌రు కావాల్సి ఉంది. గ‌డిచిన రెండున్న‌రేళ్లుగా ఆయ‌న ప్ర‌తి స్టాండింగ్ స‌మావేశానికి తూచా త‌ప్ప‌కుండా హాజ‌ర‌వుతున్నారు. అలాంటి ఆయ‌న‌.. తాజా స‌మావేశానికి గైర్హాజ‌రు కావ‌టం ఒక ఎత్తు అయితే.. ఆ నిర్ణ‌యాన్ని కొన్ని గంట‌ల ముందు తీసుకోవ‌టం మ‌రో ఎత్తుగా చెబుతున్నారు.

త‌న‌కు బ‌దులుగా.. స్టాండింగ్ క‌మిటీ స‌భ్యుడు గొల్లూరు అంజ‌య్య‌ను వెళ్ల‌మ‌ని సూచించిన తీరు చూస్తుంటే.. అధినేత నిర్ణ‌యంపై ఆయ‌న అల‌క‌బూనిన‌ట్లుగా చెబుతున్నారు. మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. త‌న సెల్ ఫోన్ ను గురువారం మ‌ధ్యాహ్నం నుంచి స్విచ్చాప్ చేసి పెట్టుకున్న నేప‌థ్యంలో.. ఆయ‌న తీరుపై కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతార‌న్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. ఇప్ప‌టివ‌ర‌కూ కేసీఆర్ నిర్ణ‌యాన్ని బ‌హిరంగంగా విభేదించిన వారు చాలా త‌క్కువ‌. ఇక‌.. కేసీఆర్ కుటుంబానికి ద‌గ్గ‌ర‌గా ఉన్న వారు.. త‌మ‌కు క‌ష్టం వ‌చ్చినా గుట్టుగా పెద్దాయ‌న చెవిలో స‌మ‌యం చూసుకొని వేయ‌ట‌మే త‌ప్పించి అల‌క‌ల వ‌ర‌కూ వెళ్ల‌లేదు. అలాంటి తీరుకు భిన్నంగా మేయ‌ర్ బొంతు వ్య‌వ‌హ‌రించిన నేప‌థ్యంలో కేసీఆర్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌న్న‌ది ఇప్పుడు ఉత్కంట‌గా మారింది.