Begin typing your search above and press return to search.

గ్రేటర్ మేయర్.. పక్కా సెటిలర్

By:  Tupaki Desk   |   12 Feb 2016 3:52 AM GMT
గ్రేటర్ మేయర్.. పక్కా సెటిలర్
X
నిజంగానే నిజం. తాజాగా గ్రేటర్ మేయర్ గా ఎంపికైన బొంతు రామ్మోహన్ అసలుసిసలు సెటిలర్. అదెలానంటే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కమ్ మంత్రి కేటీఆర్ చెప్పిన లెక్క ప్రకారం బొంతు పక్కా సెటిలర్ అనే చెప్పాలి. హైదరాబాద్ మూలాలు ఉన్నోళ్లు తప్పించి.. బయట నుంచి (అది ఆంధ్రా కావొచ్చు.. తెలంగాణ కావొచ్చు.. మరే ప్రాంతమైనా కావొచ్చు) మిగిలిన వాళ్లంతా సెటిలర్లేనని.. ఆ మాటకు వస్తే తాను కూడా సెటిలర్ నే అని చెప్పటం తెలిసిందే.

ఈ లెక్కన బొంతు రామ్మోహన్ సెటిలర్ గా చెప్పేయాలి. హైదరాబాద్ లోని చర్లపల్లి డివిజన్ నుంచి బరిలోకి దిగి కార్పొరేటర్ గా విజయం సాధించిన బొంతుది వాస్తవానికి వరంగల్ జిల్లా. గతంలో గ్రేటర్ మేయర్ గా పని చేసిన తీగల కృష్ణారెడ్డి విషయానికి వస్తే ఆయన రంగారెడ్డి జిల్లా పరిధిలోని సరూర్ నగర్ మండలం మీర్ పేట స్వగ్రామం కాగా.. బొంతుది అయితే.. ఏకంగా వరంగల్ జిల్లా. కేటీఆర్ లెక్క ప్రకారం హైదరాబాదీ కాని వాళ్లంతా సెటిలర్లే అయిన నేపథ్యంలో బొంతు రామ్మోహన్ కూడా సెటిలర్ అని చెప్పక తప్పదు.