Begin typing your search above and press return to search.

మోడీ-జ‌గ‌నూ.. ఒక తండ్రి-ఒక కొడుకు.. తెర‌వెనుక క‌థ ఇదేనా?

By:  Tupaki Desk   |   8 March 2022 8:00 AM IST
మోడీ-జ‌గ‌నూ.. ఒక తండ్రి-ఒక కొడుకు.. తెర‌వెనుక క‌థ ఇదేనా?
X
ఏపీ సీఎం జ‌గ‌న్ కాళ్ల‌కు కేంద్రంలోని న‌రేంద్ర మోడీ.. బంధం వేసేశారా? ఆయ‌న వ్యూహాత్మ‌కంగా జ‌గ‌న్‌ను త‌న‌వైపు తిప్పేసుకు నే ప్ర‌య‌త్నం చేశారా? అంటే.. ఔననే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. తాజాగా అనంత‌పురంలో ప‌ర్య‌టించిన కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌.. సీఎం జ‌గ‌న్ గురించి చాలా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీకి.. సీఎం జ‌గ‌న్ అంటే.. కుమారుడి త‌ర‌హా వాత్స‌ల్యం ఉంద‌ని.. జ‌గ‌న్ ఎప్పుడు వ‌చ్చినా.. మోడీ.. కుమారుడిగా చూస్తార‌ని.. వ్యాఖ్యానిం చారు.

అయితే.. కేంద్ర మంత్రి నిర్మ‌ల వంటివ్యూహాత్మ‌క నాయ‌కురాలు.. ఇలా అన్నారంటే.. ఊరికేనే అన‌ర‌ని అంటున్నారు మేధావులు. ప్ర‌స్తుతం.. కేంద్రంలోని మోడీ స‌ర్కారుకు వ్య‌తిరేకంగా.. జాతీయ స్థాయిలో వ్య‌తిరేక కూట‌ములు క‌డుతున్నారు. ఈ క్ర‌మంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ దేశం మొత్తం తిరిగి ప్రాంతీయ పార్టీల‌ను త‌న వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇప్ప‌టికే త‌మిళ‌నాడు, ప‌శ్చిమ బెంగాల్‌, జార్ఖండ్, బిహార్‌, ఢిల్లీ, మ‌హారాష్ట్ర త‌దిత‌ర రాష్ట్రాల నేత‌లతో కేసీఆర్ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు.

ఈ క్ర‌మంలో ఆయ‌న త్వ‌ర‌లోనే జ‌గ‌న్‌తోనూ భేటీ అయి.. త‌న‌కు మ‌ద్ద‌తు ఇచ్చే అంశంపై కోరే అవ‌కాశం ఉంద‌ని.. జాతీయ స్థాయిలో వార్త‌లు వ‌స్తున్నాయి. పైగా.. కేసీఆర్‌.. జ‌గ‌న్‌ను `మ‌న‌వాడే` అని జాతీయ‌స్తాయిలో ప్ర‌చారం కూడా చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే కేసీఆర్‌తో చెడిపోయిన‌.. మోడీ.. ఉన్న ఒక్క జ‌గ‌న్‌ను కూడా వ‌దిలేసుకుంటే.. ఇబ్బందేన‌ని భావిస్తున్న ట్టు తెలుస్తోంది. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో త‌న‌నే కేంద్రంగా చేసుకుని.. ప్రాంతీయ పార్టీలు విజృంభిస్తే.. త‌న‌కు ముప్పు త‌ప్ప‌ద‌ని ఆయ‌న అనుకుంటున్నారు.

ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్‌ను ఎలాగైనా.. త‌న‌వైపు తిప్పుకోవాల‌ని మోడీ కొన్నాళ్లుగా భావిస్తున్న విష యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే వ‌రుస‌గా అప్పాయింట్‌మెంట్లు ఇస్తున్నారు. అయినా.. జ‌గ‌న్ ఎక్క‌డ జారిపోతారో.. అనే ఆలోచ‌న‌తో మోడీ.. నిర్మ‌ల‌మ్మ‌ను వ్యూహాత్మ‌కంగా దింపార‌ని అంటున్నారు మేధావులు. సెంటిమెంటుతో కూడిన వ్యాఖ్య‌ల‌ను చేయించార‌ని అంటున్నారు. ఎందుకంటే.. మోడీ అంత‌టివాడు జ‌గ‌న్‌ను కుమారుడుగా భావిస్తున్నాడంటూ.. వ్యాఖ్యానించ‌డం అంటే.. తెర‌వెనుక వ్యూహం పెద్ద‌దే ఉంటుంద‌ని చెబుతున్నారు.

దీనిని అంత తేలిక‌గా తీసుకునే విష‌యం కాద‌ని.. చెబుతున్నారు. మోడీ ఆశీస్సుల కోసం క్యూక‌ట్టే బీజేపీ నాయ‌కులు, సీనియ‌ర్ నేత‌లు ముఖ్య‌మంత్రులు, ఎంపీలు ఉన్న రోజుల్లో.. స్వ‌యంగా ఆయ‌న జ‌గ‌న్‌ను కొడుకుగా చూస్తార‌ని చెప్ప‌డాన్ని సీరియ‌స్‌గానే తీసుకోవాల‌ని.. దీనివెనుక‌.. జ‌గ‌న్‌ను ముందుగానే త‌మ వ‌ల‌లో వేసుకోవ‌డం.. త‌మ చుట్టూ తిప్పుకోవ‌డం.. లేదా.. త‌మ మాట వినేలా చేసుకోవ‌డం అనే త్రిముఖ వ్యూహంతో పాటు.. కేసీఆర్‌ను ఒంట‌రిని చేయాల‌నే వ్యూహం కూడా ఉంద‌ని తెలుస్తోంద‌ని అంటున్నారు.

ఎందుకంటే.. ఎంత‌మందితో కూడినా.. పొరుగు రాష్ట్రం తెలుగు రాష్ట్రాన్ని క‌లుపుకొని పోక‌పోతే.. కేసీఆర్‌కు ఇబ్బందే.. ఇదే ఇప్పుడు మోడీకి కూడా కావాల్సింది. అందుకే జ‌గ‌న్‌ను ఏకంగా కొడుకుతో పోల్చార‌నే క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ఇక‌, ఇంత పొగిడినా.. వైసీపీ నాయ‌కులు మాత్రం ఈవిష‌యంపై ఏమాత్రం ప‌ట్ట‌న‌ట్టుగా ఉండ‌డం గ‌మ‌నార్హం. మ‌రో వైపు కేంద్రంలో జ‌గ‌న్‌కు ఏం జ‌రిగినా రాజ‌కీయం చేసే ప్ర‌తిప‌క్షం కూడా ఈ వ్యాఖ్య‌ల‌పై మౌనంగా ఉండ‌డం కూడా చూస్తున్నాం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.