Begin typing your search above and press return to search.
పోలీస్ శాఖలో ఇకపై వారికి కూడా ఉద్యోగాలు
By: Tupaki Desk | 22 Dec 2021 1:03 PM ISTకర్ణాటకలోని బొమ్మై సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్ర పోలీసు శాఖలో మహిళలు, పురుషులతో పాటు ట్రాన్స్ జెండర్లకు కూడా అవకాశం కల్పించింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని ట్రాన్స్ జెండర్లకు ఓ మంచి అవకాశం కల్పించట్లు అయ్యింది. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఈ కీలక నిర్ణయంపై చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ట్రాన్సె జెండర్లు ముఖ్యమంత్రికి ఇతర నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇప్పటివరకు పోలీసు శాఖలో కేవలం స్త్రీలు, పురుషులు మాత్రమే ఉండే వారు. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఈ కీలక నిర్ణయంతో ఇకపై ఆ రాష్ట్రంలో ట్రాన్స్ జెండర్లు కూడా పోలీసులుగా విధులు నిర్వహించనున్నారు. అయితే ఇప్పటి వరకు వచ్చిన ఏ నోటిఫికేషన్ లోనూ ట్రాన్స్ జెండర్లకు సంబంధించి ఇవ్వలేదు. ఇకపై ప్రభుత్వం విడుదల చేయనున్న ప్రతీ పోలీసు నోటిఫికేషన్లో వీరి కోసం ప్రత్యేకంగా ఓ కాలమ్ ఉండనుంది.
కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఓ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అయితే ఈ నోటిఫికేషన్ లో మహిళలకు, పురుషులతో పాటు వారికి కూడా అవకాశం కల్పించింది కర్ణాటక ప్రభుత్వం. ఈ నోటిఫికేషన్ లో మొత్తం పోస్టుల సంఖ్య 70 ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు. అయితే ట్రాన్స్ జెండర్ లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి అంటే కచ్చితంగా మార్గదర్శకాలను ఫాలో కావాల్సి ఉంటుందని పేర్గొన్నారు.
ట్రాన్స్ జెండర్ అప్లికేషన్ ను స్వీకరించాలంటే వారు కచ్చితంగా ప్రభుత్వం నిర్దేశించిన దాని ప్రకారం డిగ్రీ చదివి ఉండాలి. అంతేగాకుండా వారు ట్రాన్ జెండర్ అనే ధ్రువపత్రం కూడా అందులో పొందుపరచాల్సి ఉంటుందని పోలీసు శాఖ పేర్కొంది. ఈ సర్టిఫికెట్ ను జిల్లా మెజిస్ట్రేట్ దగ్గర నుంచి తీసుకోవాల్సి ఉంటుందని వివరించింది. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ సమయంలో వీటిని తప్పని సరిగా చూపించాల్సి ఉంటుదని చెప్పారు.
ముఖ్యంగా ఈ నిర్ణయం తీసుకునేందుకు కారణం లింగ సమానత్వం అని అధికారులు పేర్కొన్నారు. దీంతోనే వారికి కూడా అవకాశం కల్పించినట్లు వివరించారు. ఈ నోటిఫికేషన్ లో ఎంతమంది ట్రాన్స్ జెండర్లు ఎంపికి అవుతారు అనేది చూడాలి. ఇప్పటికే చాలా శాఖల్లో ఉన్నతాధికారులు గా ట్రాన్స్ జెండర్లు పని చేస్తున్నారు. వారి కోసం కొన్ని ప్రభుత్వాలు ఇప్పటికే సంక్షేమ పథకాలను కూడా ప్రారంభించాయి. ఈ నిర్ణయంతో ట్రాన్స్ జెండర్లలో కూడా చదువు కోవాలి అనే కోరిక పెరుగుతుందని సామాజిక నిపుణులు చెప్తున్నారు.