Begin typing your search above and press return to search.
కొత్త సంవత్సరం వేళ కేసీఆర్ ఉలిక్కిపడే మాట చెప్పిన బండి
By: Tupaki Desk | 1 Jan 2021 4:25 PM ISTసంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్య చేశారు. తెలంగాణ అధికారపార్టీకి చెందిన 30 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నట్లుగా ఆయన చెప్పారు. అయితే.. తాము ప్రజాస్వామ్య పద్దతులకు విరుద్ధంగా వెళ్లమని చెప్పిన ఆయన.. టచ్ లోకి వచ్చిన ఎమ్మెల్యేల్ని పార్టీలోకి తీసుకోవటం లేదన్నారు. 2023లో తమ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రానున్నట్లు చెప్పారు.
ఎన్నికల్లో టీఆర్ఎస్ ను తెలంగాణ ప్రజలు ఓడించనున్నట్లు చెప్పిన ఆయన.. నూతన సంవత్సరం సందర్భంగా గవరనర్ తమిళ సైను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. తమ పార్టీకి ఏ పార్టీలో పొత్తు లేదని తేల్చేశారు.గ్రేటర్ ఎన్నికల ఫలితాలు వెల్లడై నెల రోజులు అవుతుందని.. ఇంతవరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయలేదన్నారు. ఇదే అంశంపై గవర్నర్ కు కంప్లైంట్ చేశామన్నారు.
రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని తాను మొదటి నుంచి తప్పు పడుతూనే ఉన్నానని.. అలానే జరుగుతుందన్నారు. కేసీఆర్.. అసద్ తీసుకున్న నిర్ణయాల్నే ఎన్నికల సంఘం అమలు చేస్తుందని తప్పు పట్టారు. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును అవమానిస్తున్నారన్నారు. ఎన్నికల్లో ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని.. అడ్డదారిలో గెలిచారని.. గెలిచిన తర్వాత అయినా.. ప్రజాస్వామ్య బద్దంగా నడుచుకోవటం లేదన్నారు.
గ్రేటర్ లో కొత్త కార్పొరేటర్లకు బాధ్యతలు అప్పగించకుండా.. ఇంకా రెండు నెలల సమయం ఉందని చెబుతున్నారని.. మరి.. అన్ని నెలల ముందే ఎందుకు ఎన్నికలు నిర్వహించినట్లు? అని ప్రశ్నించారు. వరదల కారణంగా హైదరాబాద్ ప్రజలు తీవ్ర కష్టాల్లో ఉన్న వేళ.. ఎన్నికల్ని వాయిదా వేయాలని కోరితే.. తన మాట వినలేదన్నారు. హడావుడిగా ఎన్నికలు జరిపితే.. ప్రతిపక్షాలు ప్రచారం సరిగా చేయలేవన్న ఉద్దేశంతోనే హడావుడిగా ఎన్నికలు పెట్టారన్నారు.
వాస్తవానికి గ్రేటర్ ఎన్నికల్లో గెలిచిన కార్పొరేటర్లకు సంబంధించిన ఎన్నికల అయిన వెంటనే వారి చేత ప్రమాణస్వీకారం చేయించాలని.. అలా చేయటం లేదన్నారు. ఎన్నికల్లో ఓడిన వారి చేత ప్రారంభోత్సవాల్ని నిర్వహిస్తున్నారని.. ఇదే మాత్రం సరైన పద్దతి కాదన్నారు. ఇలాంటప్పుడు ముందుగా ఎన్నికల్ని నిర్వహించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. కొత్త పాలక మండలిని గుర్తిస్తూ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.