Begin typing your search above and press return to search.

బాంబు రోబో చంపేసినోడే ఐదుగుర్ని చంపాడట

By:  Tupaki Desk   |   9 July 2016 2:27 PM GMT
బాంబు రోబో చంపేసినోడే ఐదుగుర్ని చంపాడట
X
ప్రపంచంలో ఏ మూలన ఉన్న ఒక్క అమెరికన్ అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయినా పెద్దన్న ఎంత సీరియస్ అవుతాడో తెలిసిందే. అలాంటిది తమ రక్షణలో కీలక భూమిక పోషించే ఐదుగురు పోలీసుల్ని చంపేసినోడి పట్ల అమెరికా ప్రభుత్వం ఎంత ప్రిస్టేజ్ గా తీసుకుంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నల్ల జాతీయులపై జాత్యాంహకారంతో శ్వేతజాతి పోలీసులు కాల్పులు జరిపిన ఉదంతంపై నల్లజాతీయులు మండిపడుతూ చేపట్టిన నిరసన ర్యాలీలో ఐదుగురు పోలీసుల్ని మరణించటం.. ఏడుగురు పోలీసులు తీవ్ర గాయాలపాలు కావటంతో పాటు పెద్ద ఎత్తున హింసాత్మకంగా మారటం సంచలనం సృష్టించింది. 9/11 తర్వాత అంత పెద్ద ఇష్యూగా తీసుకున్న అమెరికా ప్రభుత్వం.. పోలీసులపై కాల్పులు జరిపిన వారిని గుర్తించే ప్రయత్నం చేసింది.

ఎత్తైన భవనం నుంచి పోలీసుల్ని టార్గెట్ చేసి ఐదుగుర్ని చంపింది ఒక్క వ్యక్తేనని గుర్తించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో.. అతన్ని రోబో బాంబుతో మట్టుబెట్టేశారు. ఐదుగురు పోలీసుల్ని చంపేసిన దుండగుడ్ని గ్జేవియర్ జోహాన్సన్ గా గుర్తించారు. ఇతడు అమెరికా మిలటరీ మాజీ సైనికుడని.. ఆఫ్గాన్ యుద్ధ సమయంలో సైన్యంలో పని చేశాడని గుర్తించారు. దుండగుడి ఇంట్లో సోదాలు జరపగా.. బాంబు తయారీ పదారథాలు.. తుపాకులు.. ఆయుధాల్ని గుర్తించారు. శ్వేత జాతీయ పోలీసుల్ని చంపుతానని చెప్పినట్లుగా పోలీసులు చెబుతున్నారు. డాలస్ లో ఐదుగురు పోలీసులు మరణించటాన్ని తీవ్రంగా పరిగణించిన అమెరికా అధ్యక్షుడు ఒబామా.. మంగళవారం వరకూ జాతీయ పతకాల్ని సగం వరకూ కిందకు దించాలని సూచన చేయటం గమనార్హం. ఐదుగురు పోలీసుల మరణాన్ని పెద్దన్న ఎంత సీరియస్ గా తీసుకుందో ఒబామా రియాక్షన్ ను చూస్తే ఇట్టు అర్థమవుతుందని చెప్పాలి.