Begin typing your search above and press return to search.

రియోలో బెడ్రూం సీక్రెట్స్ బయటకొచ్చాయ్

By:  Tupaki Desk   |   22 Aug 2016 4:24 PM GMT
రియోలో బెడ్రూం సీక్రెట్స్ బయటకొచ్చాయ్
X
ట్రాక్ లో లక్ష్యం తప్పించి మరింకేమీ పట్టించుకోని థండర్ బోల్ట్.. ఉసేన్ బోల్ట్.. ట్రాక్ బయట కూడా అంతే స్పీడన్న విషయం స్పష్టమైంది. ట్రాక్ లోకి దిగటం ఆలస్యం చిరుతలా.. పతకాల మీద గురి పెట్టే బోల్ట్.. ట్రాక్ బయట అమ్మాయిల మనసుల్ని ఇట్టే దోచేసుకుంటాడన్న విషయం ప్రపంచానికి తెలిసిపోయింది. రియో ఒలింపిక్స్ లో తన అద్భుత ప్రతిభను ప్రదర్శించి మూడు పతకాలు సృష్టించిన అతగాడు.. రొమాన్స్ విషయంలోనూ అంతేలా చెలరేగిపోయిన విషయం బయటకు వచ్చింది.

తన గాళ్ ఫ్రెండ్ కాసి బెనెట్ తో రెండేళ్లుగా డేటింగ్ చేస్తున్న ఈ జమైకా పరుగుల వీరుడు.. తాజాగా రియో ఒలింపిక్స్ సందర్భంగా ఒక బ్రెజిల్ ముద్దుగుమ్మతో ఒక నైట్ ఎంజాయ్ చేశాడట. అయితే.. ఈ 20 ఏళ్ల బ్రెజిల్ పాపకు తాను రొమాన్స్ చేసింది బోల్ట్ తో అన్న విషయం అస్సలు తెలీదట. ఎప్పటి మాదిరే అమ్మడు తన బెడ్రూం ముచ్చట్లు సోషల్ మీడియాలో పెట్టటం.. అందులో బోల్ట్ ను గుర్తించి.. అతగాడి వీరత్వం గురించి చెప్పాక కానీ అతడెంత ప్రముఖుడన్న విషయం తనకు తెలిసిందని చెప్పుకొచ్చింది.

వెస్ట్ రియోలోని ఓ క్లబ్ లో బోల్ట్ ను కలిసినట్లుగా పేర్కొన్న ఆమె.. తన రొమాన్స్ చాలా మామూలన్నట్లుగా తేల్చేసింది. తాను ఫేమస్ కావటం కోసం ఫోటోలు పోస్ట్ చేయలేదని చెప్పగా.. ఈ భామకు మించిన బోల్డ్ నెస్ తో బోల్ట్ రియాక్ట్ అయ్యారు. తన లాంటి సెలబ్రిటీలకు ఒక్కమ్మాయితో ఉండటం కష్టమని.. సెలబ్రిటీలంతా పలువురితో సెక్స్ చేయటం చాలా కామన్ అన్నట్లుగా సోది వ్యాఖ్య చేశాడు. తమ కల్చర్ కాస్త భిన్నమని.. ఆడాళ్లతో పోలిస్తే మగాళ్లకు ఒకరి కంటే ఎక్కువమంది పార్టనర్స్ ఉంటారని చెప్పుకొచ్చాడు. మరిన్ని మాటల తర్వాత బోల్ట్ గారి గాళ్ ఫ్రెండ్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.