Begin typing your search above and press return to search.

జొమాటో ఘ‌ట‌నః డెలివ‌రీ బాయ్ కు బాలీవుడ్ హీరోయిన్‌ మ‌ద్ద‌తు.. అమానవీయం అంటూ ఫైర్!

By:  Tupaki Desk   |   14 March 2021 1:41 PM GMT
జొమాటో ఘ‌ట‌నః డెలివ‌రీ బాయ్ కు బాలీవుడ్ హీరోయిన్‌  మ‌ద్ద‌తు.. అమానవీయం అంటూ ఫైర్!
X
జొమాటో ఫుడ్ డెలివ‌రీ బాయ్ త‌న‌పై దాడిచేశాడంటూ ఓ యువ‌తి పోస్టు చేసిన వీడియో సంచల‌నం రేకెత్తించిన విష‌యం తెలిసిందే. ఫుడ్ డెలివ‌రీ చేయ‌డానికి వ‌చ్చిన స‌ద‌రు వ్య‌క్తి.. త‌న‌తో దురుసుగా ప్ర‌వ‌ర్తించాడ‌ని, ఇంట్లోకి వ‌చ్చి త‌న‌ను దారుణంగా కొట్టాడ‌ని, అందుకే ముక్కు ప‌గిలిందంటూ ర‌క్తం కారుతున్న ఫేస్ తో ఆమె వీడియో చేసింది.

దీంతో.. పోలీసులు స‌ద‌రు డెలివ‌రీ బాయ్ పై కేసు న‌మోదు చేసి, అరెస్టు చేశారు. జొమాటో కూడా యాక్ష‌న్ తీసుకుంద‌ట‌. అయితే.. వాస్త‌వంగా జ‌రిగింది ఇదీ.. అంటూ స‌ద‌రు వ్య‌క్తి ఓ వీడియో పోస్టు చేశాడు. త‌న నుంచి ఫుడ్ తీసుకున్న యువ‌తి.. డ‌బ్బులు ఇవ్వ‌నంటూ తిట్టింద‌ని, చెప్పుతో కూడా కొట్టింద‌ని ఏడుస్తూ చెప్పాడు. ఈ ఘ‌ట‌న‌లోనే ఆమె వేలికి ఉన్న ఉంగరమే.. ఆమె ముక్కుకు త‌గిలింద‌ని చెప్పాడు. కాగా.. ఈ గొడ‌వ జ‌ర‌గ‌టానికి ముందే స‌ద‌రు యువ‌తి జొమాటో ఎగ్జిక్యూటివ్ కు ఫోన్ చేసి, ఫుడ్ ఆర్డ‌ర్ ఆల‌స్య‌మైంద‌ని, ఇక ఫుడ్ అవ‌స‌రం లేద‌ని చెప్పింద‌ట‌.

ఈ ఘ‌ట‌న‌పై తాజాగా బాలీవుడ్ హీరోయిన్ ప‌రిణీతి చోప్రా స్పందించింది. ఈ మేర‌కు ట్విట‌ర్ వేదిక‌గా పోస్టు చేసింది. ‘‘మాటో ఇండియా.. ద‌య‌చేసి వాస్తవం ఏంటో తెలుసుకొని స్పందించండి. డెలివరీ బాయ్ నిర్దోషి అయితే (నేను అతన్ని నమ్ముతున్నాను) వెంటనే సదరు మహిళలను శిక్షించేందుకు హెల్ప్ చేయండి ఇది అమానవీయం, సిగ్గుచేట్టు, హృద‌య విదార‌కం. నేను ఎలా సాయం చేయ‌గ‌ల‌నో చెప్పండి’’ అంటూ పోస్టు చేసింది.