Begin typing your search above and press return to search.
ట్రంప్ ప్రమాణస్వీకారానికి బాలీవుడ్ స్టార్స్
By: Tupaki Desk | 3 Jan 2017 4:08 PM ISTఇప్పటికే పలు చర్యల ద్వారా తను భారతదేశం అభిమానినని చాటుకున్న అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు మనదేశానికి అలాంటి గౌరవమే అందించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్ ఈనెల 20వ తేదీన అమెరికా 45వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ వేడుక కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ ప్రమాణ స్వీకారోత్సవంలో బాలీవుడ్ కు చెందిన టాప్ సెలబ్రిటీలు ప్రత్యేకంగా షో నిర్వహించనుండటం విశేషం.
అగ్రరాజ్యం సారథిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరిస్తున్న సమయంలో జరిగే ఈ అత్యంత విశిష్ట కార్యక్రమం గురించి రిపబ్లికన్ హిందూ కూటమి సమాచారం ఇచ్చింది. మాజీ నటి - మిస్ ఇండియా విజేత మనస్విని మీడియాకు ఈ విషయాన్ని వెల్లడించింది. ట్రంప్ కొలువుదీరే సమయంలో భారతీయులందరినీ అదే రీతిలో అమెరికన్లను సైతం ఉత్సాహపరిచేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు మనస్విని వివరించింది. యూఎస్ క్యాపిటల్ బిల్డింగ్ లోని వెస్ట్ ఫ్రంట్ టెర్రస్ పై ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. సుమారు 40 సంస్థలకు చెందిన ఎనిమిది వేల మంది సంబరాల్లో పాలుపంచుకోనున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/