Begin typing your search above and press return to search.
రజనీకి పొలిటికల్ పైరసీ బెడద
By: Tupaki Desk | 5 Jan 2018 10:54 AM ISTసూపర్ స్టార్ రజనీకాంత్ పేరే ఒక బ్రాండ్.. దానికున్న వేల్యూని క్యాష్ చేసుకోవడానికి ఎవరికి వారు ప్రయత్నిస్తుంటారు. ఇక ఆన్ లైన్లో దేన్నైనా నిమిషాల్లో అందిపుచ్చుకునే బ్యాచులు కూడా ఇప్పుడు అదే పని చేస్తున్నాయి. రజనీ వెబ్ సైట్ ను పోలిన వెబ్‌సైట్లను సృష్టించి తాము సొమ్ము చేసుకునే ప్రయత్నాలు చేయడమే కాకుండా నిజంగా రజనీ సైట్ కోసం వెతికే నెటిజన్లను గందరగోళంలోకి నెడుతున్నారు. ఈ గందరగోళం సంగతి రజినీకి కూడా తెలియడంతో వీటిని కంట్రోల్ చేసే విషయంపై ఆయన దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు ప్రారంభంలోనే చికాకులు మొదలయ్యాయి. రాజకీయ చికాకులను ఎదుర్కోవడానికి ఆయన ముందునుంచే సిద్ధంగా ఉండగా - ఇప్పుడు రాజకీయాలతో సంబంధం లేని ఆన్ లైన్ చికాకులూ మొదలయ్యాయి. రాజకీయాల్లోకి వస్తున్నాని ఆయన ప్రకటించిన తరువాత దానికి సంబంధించి ఒక వెబ్ సైట్ నూ ఆయన అనౌన్స్ చేశారు. అయితే... ఇప్పుడు ఆ సైట్ కోసం వెతుకున్న నెటిజన్లకు అదే పేరుతో ఎన్నో సైట్లు కనిపిస్తున్నాయి. దీంతో ఏది అసలో - ఏది నకిలీయో తెలియక గందరగోళంలో పడుతున్నారు.
రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పిన రజినీ తనతో కలిసి నడవాలనుకున్నవారు తన వెబ్ సైట్లో రిజిష్టర్ చేసుకోవాలని సూచించారు. ఇందుకోసం వెబ్ సైట్ పేరు కూడా ప్రకటించారు. అయితే..దాదాపుగా అదే పేరుతో వందలకొద్దీ సైట్లు పుట్టుకొచ్చేశాయి. అయినా, అభిమానులు మాత్రం రజనీ అసలు సైటును కనుగొంటూ అందులో రిజిష్టర్ చేసుకుంటుండడం విశేషం. ఇప్పటికే 50 లక్షల మందికి పైగా అందులో సభ్యులుగా చేరడం విశేషం. ఇదీ అసలు వెబ్ సైట్... www.rajinimandram.org