Begin typing your search above and press return to search.

ల‌గ్జ‌రీకా బాప్ః రూ.100 కోట్ల కారు.. చూస్తే దిల్లు ఖ‌ల్లాసే!

By:  Tupaki Desk   |   6 Jun 2021 8:00 AM IST
ల‌గ్జ‌రీకా బాప్ః  రూ.100 కోట్ల కారు.. చూస్తే దిల్లు ఖ‌ల్లాసే!
X
క్లాస్ టికెట్ తీసుకుని చూసినా అదే సినిమా.. డీల‌క్స్ లో కూర్చొని చూసినా అదే మూవీ.. బాల్క‌నీలో కూర్చున్న అదే బొమ్మ‌.. డాల్బీ ఆట‌మ‌స్ స్పెష‌ల్ గా ఫిక్స్ చేసిన బాక్స్ లో కూర్చున్నా అదే. కానీ.. దాన్ని ఆస్వాదించే విధానం మారుతుంది. కూర్చున్న సీటు నుంచి వింటున్న సౌండ్ వ‌ర‌కు ఉండే క్వాలిటీ అనుభూతిని రెట్టింపు చేస్తాయ‌ని చెప్పొచ్చు. అందుకే.. అంద‌రికీ లగ్జ‌రీ కావాలి.

మ‌రి, ల‌గ్జ‌రీకి అంతు ఉంటుందా..? అంటే.. ఖ‌చ్చితంగా ఉండ‌ద‌ని చెప్పొచ్చు. ఉదాహ‌ర‌ణ కావాలంటే.. కార్ల త‌యారీ దిగ్గ‌జం బుగాటీ లేటెస్ట్ మోడ‌ల్ ను చూపించొచ్చు. ఇప్ప‌టి వ‌ర‌కు చాలా మందికి బీఎండ‌బ్ల్యూ, బెంజ్ రాయ‌ల్టీకి సింబ‌ల్ గా ఉండేవి. ఆ త‌ర్వాత లాంబోర్గినీ వంటి మోడ‌ల్స్ హ‌వా కొన‌సాగించాయి. ఇంకా ఎన్నో మోడ‌ళ్లు ఇప్ప‌టికీ త‌మ త‌మ స్థాయిలో స‌త్తా చాటుతూనే ఉన్నాయి. కానీ.. ఇప్పుడు మ‌నం చెప్ప‌కోబోతున్న ‘బుగాటీ’ లేటెస్ట్ మోడల్ ను చూస్తే దిమ్మ తిరుగుతుంది. ధర వింటే కళ్లు బైర్లు కమ్ముతాయి. అవును.. దీని ధర అక్షరాలా రూ.100 కోట్లు మరి!

ఫ్రాన్స్ కు చెందిన ఈ ప్ర‌ఖ్యాత కార్ల కంపెనీ.. 100 కోట్ల విలువ చేసే కారును త‌యారు చేస్తామ‌ని చాలా కాలంగా చెబుతోంది. చెప్ప‌డమే కాదు.. చేసి చూపించింది కూడా. త‌ద్వారా కార్ల ప్ర‌పంచంలో పెను సంచ‌ల‌నం సృష్టించింది. ఈ కారు మోడ‌ల్ పేరు La Voiture Noire. ప్యూర్ బ్లాక్ లో ఉన్న ఈ కారును త‌నివితీరా అలా చూస్తూనే ఉండాల‌నిపించేలా ఉంది.

డాల‌ర్ భాష‌లో చెప్పాలంటే 13.4 మిలియ‌న్ డార్లు. మ‌న క‌రెన్సీలో దాదాపు రూ.100 కోట్లు. దీన్ని త‌యారు చేయ‌డానికి ఏకంగా 65 వేల గంట‌లు (వ‌ర్కింగ్ అవ‌ర్స్‌) ప‌ట్టింద‌ట‌. మ‌రి, ఇన్ని కోట్లు పోసి కొనుక్కునే ఈ కారులో ఏమేం ఉంటాయ‌న్న‌ప్పుడు చాలా స్పెసిఫికేష‌న్స్ ఉన్నాయి. 1500 హార్స్ ప‌వ‌ర్ తో దూసుకెళ్తుందీ కారు. 16 సిలిండ‌ర్లు, నాలుగు ట‌ర్బో ఛార్జ‌ర్ల‌తో రూపొందించారు. దీంతోపాటు.. ఇంకా ఎన్నో ల‌గ్జ‌రీ సౌక‌ర్యాలు ఇందులో ఉన్నాయి. బుగాటీ కంపెనీ స్థాపించిన 110 సంవ‌త్స‌రాలు పూర్త‌యిన ఈ కారును త‌యారు చేశారు. ఇప్ప‌టికే ప‌లు ఆర్డ‌ర్లు కూడా వ‌చ్చిన‌ట్టు స‌మాచారం.