Begin typing your search above and press return to search.

7వేల మందిని తొలగించిన ప్రపంచ అతిపెద్ద విమాన తయారీ సంస్థ

By:  Tupaki Desk   |   28 May 2020 2:00 PM IST
7వేల మందిని తొలగించిన ప్రపంచ అతిపెద్ద విమాన తయారీ సంస్థ
X
ప్రపంచంలోనే అతిపెద్ద విమానాల తయారీ సంస్థ బోయింగ్ ఈ మహమ్మారి లాక్డౌన్ వేళ కుప్పకూలిన విమానయానాన్ని దృష్టిలో పెట్టుకొని కఠిన నిర్ణయం తీసుకుంది. అమెరికాలో ని తమ సంస్థలో దాదాపు 7000మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది.

ఈ మేరకు బోయింగ్ ప్రెసిడెంట్ కం సీఈవో డేవ్ కాల్డౌన్ ఉద్యోగులకు లేఖ రాశాడు. ఇప్పటికే తాము స్వచ్ఛంద తొలగింపు ఆఫర్ ఇచ్చామని.. తాజాగా విమానాల తయారీ ఆగిపోవడం.. ఖర్చులు పెరిగిన దృష్ట్యా ఉద్యోగులను తొలగించాల్సి వస్తోందిని తెలిపారు. అమెరికాలోని సంస్థలో మొదట 6770మందిని తొలగిస్తున్నట్టటు తెలిపారు. మరికొంత మందిని తొలగిస్తామన్నారు. తొలగించిన ఉద్యోగులకు మిగిలిన వేతనం.. హెల్త్ కవరేజ్ లో కంపెనీ తన వంతు సహకారం అందిస్తుందని తెలిపారు.

మహమ్మారి వైరస్ వల్ల అంతర్జాతీయంగా విమానాల మనుగడ కష్టమైందని.. ఉత్పత్తి నిలిచిందని.. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులను తగ్గిస్తున్నామని బోయింగ్ సీఈవో తెలిపారు. . మహమ్మారి వైరస్ వైమానిక పరిశ్రమపై వినాశకరమైన ప్రభావం చూపిందని బోయింగ్ సీఈవో తెలిపారు.

ఇప్పటికే వినియోగదారులకు అవసరమయ్యే వాణిజ్య జెట్ లు, సేవల సంఖ్యను తగ్గించామని బోయింగ్ సీఈవో తెలిపారు. ఇప్పటికే విమానాల తయారీ బుకింగ్స్ ఆగిపోయాయని రద్దు చేయబడ్డాయని తెలిపారు.