Begin typing your search above and press return to search.

న్యూజిలాండ్‌ లో భార‌తీయ విద్యార్థుల దుర్మ‌ర‌ణం

By:  Tupaki Desk   |   17 Nov 2015 2:18 PM GMT
న్యూజిలాండ్‌ లో భార‌తీయ విద్యార్థుల దుర్మ‌ర‌ణం
X
న్యూజిలాండ్‌ లో జ‌రిగిన ప్ర‌మాదంలో ఇద్ద‌రు భార‌తీయ విద్యార్థులు గ‌ల్లంత‌య్యారు. ఈత‌కు వెళ్లిన విద్యార్థులు అక్క‌డ జ‌రిగిన ప్ర‌మాదంలో మృత్యువాత ప‌డ్డార‌ని స్థానిక మీడియా తెలిపింది. న్యూజిలాండ్‌ లోని ప్లెంటీ డిస్ర్టిక్ట్‌ లో గ‌ల వెస్ట్రన్ బే మెక్‌ లారెన్ చెరువులో ఈ దుర్ఘ‌ట‌న చోటుచేసుకుంది.

పోలీసుల స‌మాచారం ప్ర‌కారం న‌లుగురు భార‌తీయ విద్యార్థుల బృందం మెక్‌ లారెన్ చెరువు వ‌ద్ద‌కు చేరుకున్నారు. ఈత కొట్టేందుకు ఒక విద్యార్థి చెరువు లోప‌లికి తాడు స‌హాయంతో వెళ్లేందుకు సిద్ధ‌మ‌య్యాడు. అయితే చెట్టుకు వేళ్ల‌డ‌దీనిన తాడు త‌ప్పిపోవ‌డం వ‌ల్ల ఆ విద్యార్థి చెరువులో జారిప‌డ్డాడు. ఈ క్ర‌మంలో ఆత‌న్ని ర‌క్షించేందుకు వెళ్లిన మ‌రో విద్యార్థి సైతం నీటిలో మునిగిపోయాడని స్థానిక పోలీసులు మీడియాకు తెలిపారు.

ఈ ఘ‌ట‌న‌కు ప్ర‌త్యక్ష సాక్షులుగా ఉన్న విద్యార్థులు అందించిన స‌మాచారం మేర‌కు ర‌క్ష‌క‌ద‌ళాలు విద్యార్థుల కోసం గాలింపు చేప‌ట్టింది. ఇందులో ఒక‌రి శవం సోమ‌వారం రాత్రి ల‌భించ‌గా...మ‌రొక‌రిది మ‌రుస‌టి రోజు దొరికింది. ఆ ఇద్ద‌రు విద్యార్థుల వ‌య‌సు 20 ఏళ్లు ఉంటుంద‌ని స‌మాచారం. ఇదిలాఉండ‌గా... స్థానిక సిక్కు సంఘాల ప్ర‌తినిధి లెంబ‌ర్ సింగ్ ఈ ఘ‌ట‌న‌పై స్పందిస్తూ ఈత రాని వారి నీటి ప‌రివాహ‌క ప్రాంతాల‌కు పంపేట‌పుడు జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని కోరారు.