Begin typing your search above and press return to search.

అంతరిక్షం నుండి హరికేన్, నెటిజన్లు ఫిదా

By:  Tupaki Desk   |   28 July 2020 12:30 AM GMT
అంతరిక్షం నుండి హరికేన్, నెటిజన్లు ఫిదా
X
మనం భూమిపై నుండి సైక్లోన్ చూస్తేనే ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. అదే అంతరిక్షం నుండి సైక్లోన్ చూస్తే ఎలా ఉంటుంది? వ్యోమగామి బాబ్ బెహ్న్‌కెన్ అంతరిక్షం నుండి తీసిన ఓ సైక్లోన్ ఫోటోను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేసారు. ఇది నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇదివరకు అంతరిక్షం నుండి ఉరుములతో కూడిన దృశ్యాన్ని నెటిజన్లకు పంచారు. ఇప్పుడు హరికేన్‌ను షేర్ చేసి ఆహ్లాదాన్ని పంచారు.

మెక్సికో సమీపంలో ఎర్పడిన హరికేన్ హన్నాకు సంబంధించిన ఫోటోను ట్వీట్ చేశారు. అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం నుండి వ్యోమగామి బాబ్ బెహ్న్‌కెన్ దీనిని తన కెమెరాలో బంధించి, దానిని సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. మెక్సికో గల్ఫ్ ప్రాంతంలో హరికేన్ హన్నా బలపడుతున్న నేపథ్యంలో స్పేస్ స్టేషన్ నుండి అది కనిపించిందని, దీంతో వెంటనే ఫోటో తీశానని పేర్కొన్నారు.

బాబ్ బెహ్న్‌కెన్ ఫోటోపై నెటిజన్లు స్పందించారు. అద్భుతంగా ఉందంటూ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. నమ్మశక్యం కాని ఫోటో అని, అద్భుతమైన ఫోటో అంటూ ఆనందం వ్యక్తం చేశారు.