Begin typing your search above and press return to search.

సముద్రంలో ఘోర పడవ ప్రమాదం.. 57 మంది జలసమాధి !

By:  Tupaki Desk   |   27 July 2021 10:31 AM GMT
సముద్రంలో ఘోర పడవ  ప్రమాదం.. 57 మంది జలసమాధి !
X
లిబియాలోని ట్రిపోలీలో జరిగిన ఘోర పడవ ప్రమాదంలో 57 మంది చనిపోయారని తెలిసింది. శరణార్థులను తీసుకెళ్తున్న పడవ, పక్కకు ఒరిగి నీటిలో మునిగిపోయిందని ఐక్యరాజ్యసమితి శరణార్థుల అధికారులు తెలిపారు. శరణార్థుల అంతర్జాతీయ సంస్థ ప్రతినిధి సఫా సేహ్లీ ప్రకారం ఆదివారం ఆ పడవ ఖూమ్స్ పట్టణ పశ్చిమ తీరం నుంచి బయలుదేరింది. అందులో 75 మంది ప్రయాణికులు ఉన్నారని చెప్పినట్లు అల్ జజీరా తెలిపింది. ప్రమాదం జరిగాక 18 మందిని కాపాడి , సోమవారం తీరానికి తీసుకొచ్చారని సేహ్లీ చెప్పారు. బతికిన వాళ్లలో నైజీరియా, ఘనా, గాంబియాకు చెందిన వాళ్లున్నారు.

సముద్రంలో వెళ్తుండగా బోటుకు ఇంజిన్ సమస్య తలెత్తింది. దాంతో బోటు ఆగిపోయింది. అదే సమయంలో అక్కడ వాతావరణం అస్సలు బాలేదు. దాంతో అలల తాకిడి ఎక్కువై బోటు మునిగిపోయిందని సెహ్లీ చెప్పారు. బోటు మునిగిపోవడాన్ని కొందరు చేపల జాలర్లు చూశారు. వెంటనే రంగంలోకి దిగి, ప్రాణాలకు తెగించి కొందరిని కాపాడారు. అదే సమయంలో కోస్ట్ గార్డ్ కూడా రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. చనిపోయిన వారిలో 20 మంది మహిళలు, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అని సెహ్లీ తన ట్విట్టర్‌ ఆకౌంట్‌ లో తెలిపారు. ఇంజిన్‌లో సాంకేతిక సమస్య కారణంగా సముద్రంలో పడవ ఆగిపోయిందని సమాచారం. ఆ తర్వాత ప్రతికూల వాతావరణ పరిస్థితులు కూడా ఇందుకు తోడవడంతో పడవ ఒక్కసారిగా బోల్తా పడింది.

మధ్యధరా సముద్రం లో ఎన్నో విషాద గాథలు. వాటిలో ఏదోకటి . ప్రమాదకరమైన ఆ సముద్రంలో రోజూ కొన్ని వందల మంది, యూరప్ దేశాలకు శరణార్థులుగా వెళ్తున్నారు. అక్కడ ఏదో ఒక ఉపాధి వెతుక్కొని జీవించవచ్చు అని భావిస్తున్నారు. ఇదే సముద్రంలో గత వారం 20 మంది చనిపోయారు. మరో 500 మందిని అప్పటికప్పుడు వెనక్కి అంటే లిబియాకి తీసుకొచ్చేశారు. ఈమధ్య లిబియా నుంచి విదేశాలకు శరణార్థులుగా వెళ్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. యూరోపియన్ యూనియన్ సాయం చేస్తున్న లిబియాలో కోస్టు గార్డులు, ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లో దాదాపు 15,000 మంది వలస దారులను మధ్యలోనే అడ్డుకొని వెనక్కి తీసుకొచ్చారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కూడా, గత ఆరు నెలల్లో 7,000 మందిని సముద్రంలో అడ్డుకొని, లిబియాలోని డిటెన్షన్ క్యాంపులకు తరలించింది. 2011 నుంచి లిబియాలో అంతర్గత యుద్ధం జరుగుతోంది. అందువల్ల చాలా మంది యూరప్ వెళ్లిపోవాలను కుంటున్నారు. అక్రమంగా తరలిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలా వాళ్లను తరలించే బోట్లలో పరమితికి మించి ఎక్కించేసుకోవడంతో ఆ బోట్లు సముద్రంలో బోల్తాపడి, వారిని జలసమాధి చేస్తున్నాయి.

యూరప్‌ లో మెరుగైన జీవితం కోసం శరణార్థులు మధ్యధరా సముద్రం మీదుగా పడవల ద్వారా వలస వెళ్లడం మనం చాలా సార్లు చూశాం. మరో 500 మంది వలస వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా, అధికారులు అడ్డుకొని లిబియాకు తరలించారు. ఇటీవల లిబియా నుంచి వలస వెళ్తున్న వారి సంఖ్య పెరిగింది. ఈ ఏడాది తొలి 6 నెలల్లో 15 వేల మంది శరణార్థులను ఈయూ మద్దతు గల లిబియా కోస్ట్‌ గార్డ్‌ అడ్డుకున్నారు. ఈ మొదటి ఆరు నెలలు సముద్రం మీదుగా వలస వెళ్తున్న అడ్డుకొని 7వేల మందికిపైగా లిబియాలోని నిర్బంధ శిబిరాలకు బలవంతంగా తరలించారు. 2011 తిరుగుబాటు తర్వాత నుంచి పడవల ద్వారా జనం యూరప్‌ కు వలస వెళ్తున్నారు. ఇప్పటికే ఈ ఏడాది 23వేలకుపైగా వలసదారులు ఐరోపాకు వచ్చారని యూఎన్‌ హెచ్‌ సీఆర్‌ అంచనా వేస్తుంది.సముద్రం మీదుగా ఆయా దేశాల నుండి వచ్చే వలసదారులు ఇలా ప్రమాదాలు జరుగుతూ మరణిస్తున్నా, ఈ వలసలు ఆగేలా లేవు. ఆయా దేశాలలో భయానక పరిస్థితులతోనే ప్రజలు ప్రాణాలకు తెగించి అక్రమంగా పొరుగు దేశాలలో చొరబడుతున్నారు.