Begin typing your search above and press return to search.

పడవ ప్రమాదం: ఆ 14మంది చనిపోయినట్టే?

By:  Tupaki Desk   |   25 Sep 2019 11:53 AM GMT
పడవ ప్రమాదం: ఆ 14మంది చనిపోయినట్టే?
X
తూర్పుగోదావరి జిల్లా కచ్చలూరు ప్రమాదంలో ఇప్పటివరకు 35 మంది మృతదేహాలను వెలికి తీసిన ఏపీ సర్కారు.. ఇక రెండు వారాలుకు దగ్గర అవుతుండడంతో మిగతావారి జాడను వెతకడం నిలిపేసింది.. మరో 14మంది ఆచూకీ ఇప్పటివరకూ దొరకలేదు. దీంతో సహాయక చర్యలు నిలిపివేశారు.

ప్రస్తుతం అధికారుల అంచనా ప్రకారం గోదావరిలో 210 అడుగుల లోతున పడవ పడి ఉంది. పడవను తీయడానికి ఉత్తరాఖండ్ నుంచి నిపుణులు తీసుకొచ్చారు. కానీ వారు వచ్చి ఈ వరద గోదావరి - ఎర్రటి నీళ్ల నుంచి తీయడం సాధ్యం కాదని తేల్చేశారు. దీంతో అధికారులు నదిలో మునిగిన బోటును తీయడం సాధ్యం కాదని ఏపీ సీఎం జగన్ కు ఈ నివేదిక ఇచ్చినట్టు తెలిసింది.

ఇక తాజాగా పడవ ఆపరేషన్ పాల్గొన్న అధికారులు సీఎం జగన్ తో చర్చలు జరిపారు. పడవను తీయడం సాధ్యం కాదని.. ఆ 14మంది మృతదేహాలు పడవలోనే ఉండిపోయినట్టుగా భావిస్తున్నామని చెప్పినట్టు తెలిసింది. దీంతో ఆ 14మంది చనిపోయినట్టుగా గుర్తించాలని వైసీపీ ప్రభుత్వం ప్రకటన చేయడానికి సిద్ధమైంది. వారి బంధువులకు ఈ మేరకు సమాచారం తెలుపడానికి రెడీ అయినట్టు తెలిసింది.

తాజాగా ఈ శుక్రవారం గోదావరిలో మునిగిన రాయల్ వశిష్ట బోటు యజమానులైన కే వెంకటరమణ తోపాటు మరో ఇద్దరు మహిళలు ప్రభావతి, అచ్యుతమనిని పోలీసులు అరెస్ట్ చేశారు. పడవను నిర్లక్ష్యంగా నడిపి ఇంత మంది ప్రాణాలు పోవడానికి కారమైనట్టుగా పోలీసులు అభియోగాలు మోపారు.