Begin typing your search above and press return to search.

నిర్ల‌క్ష్యానికి అద్దం : మ‌రో ప‌డ‌వ బోల్తా

By:  Tupaki Desk   |   26 May 2018 8:51 AM GMT
నిర్ల‌క్ష్యానికి అద్దం :  మ‌రో ప‌డ‌వ బోల్తా
X
స‌రిగ్గా ప‌దిరోజుల క్రితం గోదావ‌రి న‌దిలో ప‌డ‌వ మునిగి 22 మంది మ‌ర‌ణించిన విష‌యం మ‌రిచిపోక‌ముందే గుంటూరు జిల్లా బోరుపాలెం వ‌ద్ద ఈ రోజు మ‌రో ప‌డ‌వ ప్ర‌మాదం జ‌రిగింది. న‌దిలో చేప‌ల‌వేట‌కు వ‌చ్చిన‌ ప‌డ‌వ‌ను ఇసుక త‌ర‌లిస్తున్న మ‌రో ప‌డ‌వ ఢీ కొట్ట‌డంతో అందులో ప్ర‌యాణిస్తున్న త‌ల్లీ - కూతురు మృతిచెంద‌గా - తండ్రి న‌దిని ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు.

ప‌ది రోజుల క్రితం జ‌రిగిన ప్ర‌మాదంలో కొన్ని శ‌వాలు ఇంకా ఆచూకీ దొర‌క‌లేదు. ఈ లోపు మ‌రో ప్ర‌మాదం చోటుచేసుకోవ‌డం ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యానికి అద్దం ప‌డుతుంది. తూర్పు - ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల మ‌ధ్య‌న మంటూరు - టేకూరు గ్రామాల మ‌ధ్య‌న ప్ర‌మాదం జ‌రిగింది. అంత‌కు స‌రిగ్గా నాలుగు రోజుల క్రితం అదే ప్రాంతంలో గోదావ‌రి న‌దిలో లాంచీలో అగ్నిప్ర‌మాదం జ‌రిగింది.

అగ్నిప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు అధికారులు - ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తం అయి ఉంటే ఆ త‌రువాత 22 మంది మ‌ర‌ణం ఎట్టి ప‌రిస్థితుల‌లోనూ సంభ‌వించేది కాదు. న‌దుల‌లో అనుమ‌తులు లేకుండా అక్ర‌మంగా న‌డిచే ప‌డ‌వ‌ల మూలంగా ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయి. ప్ర‌భుత్వం మాత్రం ఎన్ని ప్ర‌మాదాలు జ‌రిగినా మేలుకోవ‌డం లేదు.