Begin typing your search above and press return to search.
చేయెత్తితే.. చేయి నరుకుతాం.. బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు !
By: Tupaki Desk | 8 Sept 2020 5:00 PM ISTతెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ అల్వాల్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పాతబస్తీలో బీజేపీ మద్దతుదారులు, హిందువులు ఇబ్బంది పడుతున్నారని ఆయన ఆరోపించారు. వారిని బీజేపీ కాపాడుకుంటుందని, ఎవరైనా వారిపై వేలెత్తి చూపిస్తే.. వారి చేయి నరుకుతాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అది ఎవరి జాగీరు కాదంటూ మండిపడ్డారు. అలాగే , త్వరలో జరగబోయే జీహెచ్ ఎం సీ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ స్థానాలు సాధిస్తుందని అధినేత ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించే అంశంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బండి సంజయ్ ఆరోపణలు చేశారు.
బీజేపీ నాయకులెవరూ కేసులకు భయపడాల్సిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలు, కార్యకర్తలను కేసులు పెట్టి వేధించాలని టీఆర్ఎస్ ప్రభుత్వం భావిస్తోందని , వారికి పార్టీ నుండి పూర్తి మద్దతు ఉంటుంది అని తెలిపారు. ఇక ఇదే సందర్భంలో కొన్ని మీడియా సంస్థల తీరుపైనా బండి సంజయ్ విరుచుకుపడ్డారు. కొన్ని పత్రికలు అధికార పార్టీకి భజన చేస్తున్నాయని, ,వారు రాసే వార్తలను చదివి ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు. బీజేపీ వార్తలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపించారు. ఆ కొన్ని పత్రికలకు రానున్న రోజుల్లో తగిన శాస్తి తప్పదని ఆయన హెచ్చరించారు. మొత్తంగా ఇప్పుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశాలుగా మారాయి.