Begin typing your search above and press return to search.
బీఎండబ్ల్యూ బైక్ వచ్చేసింది..! ధర తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే..!
By: Tupaki Desk | 25 March 2021 3:17 PM ISTబీఎండబ్ల్యూ కార్లు అంటేనే అదో లగ్జరీ. కేవలం కోటీశ్వరులు, ఓ రేంజ్ ఉన్నవాళ్లు మాత్రమే ఆ కారులో తిరుగుతారు. సినీ తారలు, సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు, ధనవంతులు మాత్రమే ఆ కార్లలో తిరుగుతారు. ఎందుకంటే ఆ కంపెనీ కార్ల మినిమం రేంజ్ అరకోటి ఉంటుంది. ఇదిలా ఉంటే
బీఎండబ్ల్యూ తాజాగా బైక్‌ను మార్కెట్ లోకి విడుదల చేసింది. ఇవాళ్టి నుంచే ఆ బైక్‌లను వినియోగదారులు బుక్ చేసుకోవచ్చు.
బీఎండబ్ల్యూ ఎం 1000 ఆర్ఆర్ పేరుతో మొదటి మోడల్‌ను మనదేశంలో మార్కెట్లోకి విడుదల చేసింది కంపెనీ.
ఇప్పటికే విదేశాల్లో ఈ బైక్ అందుబాటులో ఉన్నప్పటికీ మనదేశంలో కొత్త బైక్‌ను లాంచ్ చేసింది.
రెండు వేరియంట్లలో ఈ బైక్ మార్కెట్లో అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.
బీఎండబ్ల్యూ ఎం 1000 ఆర్ఆర్ ధర 42 లక్షల రూపాయలుగా నిర్ణయించారు. కాగా బీఎండబ్ల్యూఎం 1000 ఆర్ఆర్ కాంపిటిషన్ ధరను 45 లక్షలుగా నిర్ణయించినట్టు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
ఈ రెండు బైక్ లకు మూడేళ్ల వారంటీ ఇస్తున్నట్టు కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు.ఓ మూడేళ్లలో ఓ డ్యామేజీ జరిగినా కంపెనీ చూసుకుంటుంది.ఈ బైకులు కేవలం 3 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలవు.
14,500 ఆర్‌పిఎమ్ వద్ద 212 హెచ్‌పి (156 కిలోవాట్) సామర్థ్యంతో పనిచేస్తాయి. గంటకు 306 కిలోమీటర్ల వేగంతో వెళతాయి.