అద్భుతం: ఊడిన అంగం.. చేతికి మొలిచింది

Sun Aug 02 2020 11:40:13 GMT+0530 (IST)

blown organ .. sewn to hand

ఇది ప్రపంచంలోనే వింత సంఘటన.. కొన్నాళ్ల కిందట ఊడిపోయిన అంగాన్ని అతడి చేతికే మొలిపించిన వింత సంఘటన ఇదీ. నాలుగేళ్లుగా ఆ ఆంగాన్ని అతడు చేతిలో పట్టుకొని తిరుగుతున్నాడు.ఇంగ్లండ్ లోని నార్ఫోల్క్ లో నివసిస్తున్న మాల్కోలమ్ మెక్ డొనాల్డ్ కు 45 ఏళ్లు. అతడికి పెరినియం ఇన్ఫెక్షన్ కారణంగా అతడి అంగం పూర్తిగా నల్లగా మారిపోయి ఊడిపోయింది. దీంతో వైద్యులు 2014లో దాన్ని పూర్తిగా తొలగించారు. అప్పటి నుంచి అతడు అంగం లేకుండానే జీవిస్తున్నాడు. ఫలితంగా భార్య అతడిని వదిలేసింది. పిల్లలను కూడా తీసుకొని వెళ్లిపోయింది.  ఇక తాను మగాడిలా బతకలేనో ఏమోనని కుమిలిపోయాడు.

వైద్యులను సంప్రదించగా ఊడిన అంగాన్ని మళ్లీ పుట్టించవచ్చని తెలిపాడు. లండన్ యూనివర్సిటీ లో పనిచేసే ప్రొపెసర్ రాల్ఫా పోయిన పురుషాంగాన్ని మళ్లీ అతికించవచ్చని.. కష్టమైన ప్రొసీజర్ ఉంటుందని తెలిపాడు.ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా రూ.49 లక్షలు కూడబెట్టి ఈ చికిత్సనారంభించారు.

ఎడమ చేతి మాంసాన్ని చర్మాన్ని తీసి అక్కడే అంగాన్ని తయారు చేసి అమర్చారు. అలా రెండేళ్ల పాటు భరించాడు. అంగాన్ని చేతిలో పెట్టుకొని తిరిగాడు. 2020 ఏప్రిల్ లో అంగాన్ని ఏర్పాటు చేయాలని భావించారు. కానీ కరోనా వల్ల వాయిదా పడింది. దీంతో నాలుగేళ్లుగా అతడు అంగాన్ని చేతిలోనే ఉంచుకొని తిరుగుతున్నాడు. ఫుల్ హ్యాండ్స్ దుస్తులు ధరించి అందులో దాచుకొని తిరుగుతున్నాడు. ప్రపంచంలోనే తొలిసారి చేతిలో అంగాన్ని పెంచుకుంటున్న తొలి వ్యక్తిగా గుర్తింపు పొందాడు.