Begin typing your search above and press return to search.

మేరీమాత విగ్ర‌హం నుంచి ర‌క్తం!

By:  Tupaki Desk   |   29 Jun 2017 4:16 AM GMT
మేరీమాత విగ్ర‌హం నుంచి ర‌క్తం!
X
మేరీ మాత విగ్ర‌హం నుంచి క‌న్నీరు.. ర‌క్తం లాంటి ద్ర‌వం కారుతుండ‌టం సంచ‌ల‌నం రేపుతోంది. ఈ విచిత్ర ఘ‌ట‌న వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లా ఐన‌వోలు మండ‌లం సింగారం శివారులోని గుంటూరుప‌ల్లిలో చోటు చేసుకుంది. ఈ విగ్ర‌హాన్ని మొన్న‌టి ఆదివారం నాడే ప్ర‌తిష్టించార‌ని చెబుతున్నారు.

ఆదివారం ఏర్పాటు చేసిన మేరీ మాత విగ్ర‌హం నుంచి ద్ర‌వం కారుతుండ‌టం సంచ‌ల‌నంగా మారింది. ఈ ఉదంతం స్థానికంగా సంచ‌ల‌నంగా మారింది. బుధ‌వారం ఉద‌యం నుంచి ఈ విచిత్ర ఘ‌ట‌న చోటు చేసుకుంటున్న వైనాన్ని గుర్తించారు.చ‌ర్చి పాధ‌ర్ మేరీ విగ్ర‌హం నుంచి ద్ర‌వాలు కారుతుండ‌టాన్ని గుర్తించారు.

ఈ స‌మాచారాన్ని ఇన్ ఛార్జ్ బిష‌ఫ్ జోస‌ఫ్ కు స‌మాచారం అందించారు. దీంతో ఆయ‌న మేరీ మాత విగ్ర‌హాన్ని సంద‌ర్శించారు. మేరీ విగ్ర‌హం నుంచి గుర్తు తెలియ‌ని ద్రావ‌ణాలు విగ్ర‌హం నుంచి బ‌య‌ట‌కు వ‌స్తున్న వైనం వైర‌ల్ అయ్యింది. జ‌నం తండోపతండాలు వ‌చ్చి.. మేరీ విగ్ర‌హాన్ని సంద‌ర్శిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/