Begin typing your search above and press return to search.

స్వీట్ గా కాల్ వచ్చిందని వెళ్తే ..జింతాత.. జింతాతే

By:  Tupaki Desk   |   3 Sep 2020 11:30 PM GMT
స్వీట్ గా కాల్ వచ్చిందని వెళ్తే ..జింతాత.. జింతాతే
X
డబ్బున్నవాళ్లను ముగ్గులోకి దించి.. వీడియోలు తీసి బ్లాక్​మెయిలింగ్​కు పాల్పడుతూ రూ. లక్షలు వసూలు చేస్తున్న ఓ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్​లోని జైపూర్​కు చెందిన ఓ యువతి, మరో నలుగురు యువకులు ముఠాగా ఏర్పడ్డారు. ధనవంతులను పరిచయం చేసుకొని.. వారికి ఫోన్​చేస్తున్నారు. తర్వాత యువతి వారితో స్వీట్​గా మాట్లాడుతూ మత్తులోకి దించుతుంది. సెమీ న్యూడ్​గా సదరు యువతకి వీడియో కాల్​ చేస్తూ వారిని రెచ్చగొడుతుంది. అనంతరం ముగ్గులోకి దించి తమ వెంట రహస్య ప్రదేశానికి తీసుకెళ్తుంది. అనంతరం ముఠా సభ్యులు ఫోన్​సంభాషణలు, యువతితో గడిపిన పర్సనల్​ దృశ్యాలను రికార్డ్​ చేస్తారు. వాటితో బ్లాక్​మెయిలింగ్​ చేసి భారీగా డబ్బులు గుంజుతున్నారు. ఇటువంటి ఓ ముఠాను రాజస్థాన్​ ప్రభుత్వం అదుపులోకి తీసుకున్నది. వారిని విచారించగా విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి చూశాయి.

రాజస్థాన్​ రాజధాని జైపూర్​ కేంద్రంగా ఈ రాకెట్​ తమ కార్యకలపాలను కొనసాగించింది. మొత్తం ఐదుగురు మహిళలను ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొదట పరువు పోతుందని భయపడి ఎవరూ ఫిర్యాదు చేయలేదు. అడిగినంతా డబ్బు ఇచ్చి కామ్​గా ఉన్నారు. కానీ ఓ బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో ఈ రాకెట్​ గుట్టురట్టయ్యింది. నిందితుల దగ్గరి నుంచి శివదాస్ పుర పోలీసులు రూ. లక్ష నగదు, దేశీయంగా తయారు చేసిన పిస్టల్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ధనవంతులు, ప్రముఖులను టార్గెట్ చేసే వారని పోలీసులు తెలిపారు. సోషల్​మీడియాలో వీడియోలు పెడతామంటూ మోసగించి డబ్బులు వసూలు చేశారని చెప్పారు. హనీట్రాప్ ముఠాపై అనేక ఫిర్యాదులు వచ్చాయని, పోలీసు కమిషనర్ మనోజ్ చౌదరి తెలిపారు. దౌసా జిల్లాలోని లాల్సోట్ లోని సావాసా గ్రామంలో నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు ఆయన తెలిపారు. ఇటువంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.