Begin typing your search above and press return to search.

నల్ల ప్రముఖులు లిస్టు చూస్తే షాకవ్వాల్సిందే..

By:  Tupaki Desk   |   4 April 2016 7:27 AM GMT
నల్ల ప్రముఖులు లిస్టు చూస్తే షాకవ్వాల్సిందే..
X
నల్లధన ప్రముఖుల వివరాలు ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. రష్యా అధ్యక్షుడు పుతిన్ సహా ప్రపంచ ప్రముఖల పేర్లు ఇందులో ఉన్నాయి. ఇండియాలో అమితాబ్ వంటి ప్రముఖుల పేర్లు అందులో ఉన్నాయి. . 1975 నుంచి గత ఏడాది చివరివరకు ఉన్న వివరాలు ఇందులో ఉన్నాయని, ఈ పత్రాలను పరిశీలిస్తున్న కొద్దీ గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని వివరాలు వెలుగులోకి వస్తున్నాయని చెబుతున్నారు. ఇండియాలో లోక్ సత్తా పార్టీ ఢిల్లీ నేత అనురాగ్ కేజ్రీవాల్ పేరు ఆ జాబితాలో ఉంది. ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్సు వెల్లడించిన బ్లాక్ మనీ లిస్టులో కొందరు ప్రముఖుల పేర్లివి..

దేశాల అధ్యక్షులు

- మౌరికో మాక్రి - అర్జెంటీనా అధ్యక్షుడు.

- సిగ్ముందర్ డేవియో గునాల్గుసన్ - ఐస్ ల్యాండ్ ప్రధాని.

- సల్మాన్ - సౌదీ అరేబియా రాజు.

- ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ - యునైటెడ్ అరబ్ ఎమిరేట్సు అధ్యక్షుడు.

- పెట్రో పోరోషన్కో - ఉక్రెయిన్ అధ్యక్షుడు.

మాజీ దేశాధ్యక్షులు

- బిద్ జినా ఇవానిష్ విలీ - జార్జియా మాజీ ప్రధాన మంత్రి.

- అయద్ అలావీ - ఇరాక్ యాక్టింగ్ ప్రైమ్ మినిస్టర్.

- ఆలీ అబూ అల్ రహేబ్ - జోర్డాన్ మాజీ ప్రధాన మంత్రి.

- హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ - ఖతార్ మాజీ ఎమిర్

- హమద్ బిన్ జాసిమ్ బిన్ జాబెర్ అల్ థానీ - ఖాతార్ మాజీ ప్రధాని.

- అహ్మద్ అల్-మిర్గానీ - సూడాన్ మాజీ అధ్యక్షుడు.

- పావ్ లో లాజరెంకో - ఉక్రెయిన్ మాజీ ప్రధానమంత్రి.

వీరితో పాటు అల్జీరియా - అంగోలా - అర్జెంటీనా మంత్రులు... బ్రెజిల్ - కంబోడియా - చిలీ - కాంగో - ఈక్వడార్ దేశాల మంత్రులు.. కీలక అధికారులు... ఫ్రాన్సు - గ్రీస్ - హంగేరి - ఐస్ ల్యాండ్ - కెన్యా - నైజీరియా - పాలస్తీనా - పనామా - పెరు - పోలాండ్ - రువాండా - సౌదీ అరేబియా - బ్రిటన్ - వెనిజులా - జాంబియా దేశాల ముఖ్య నేతలు - కీలక అధికారులు ఉన్నారు.