Begin typing your search above and press return to search.

ఫిబ్రవరి లో బీజేపీ కి కొత్త జాతీయాధ్య‌క్షుడు ..ఎవరంటే ?

By:  Tupaki Desk   |   18 Dec 2019 7:09 AM GMT
ఫిబ్రవరి లో బీజేపీ కి కొత్త జాతీయాధ్య‌క్షుడు ..ఎవరంటే ?
X
బీజేపీ ..భారతీయ జనతా పార్టీ. ఈ బీజేపీ పార్టీ గత కొన్నేళ్లు గా ఒక అంతర్గత రాజ్యాంగాన్ని నడిపిస్తుంటుంది. ఈ అంతర్గత రాజ్యాంగం ప్రకారం ..బీజేపీ పార్టీలో ఉన్న ఏ నేత అయినా కూడా ఒకేసారి రెండు పదవులు చేపట్టకూడదు. అలాగే రెండుసార్లకి మించి అధ్య‌క్ష ప‌ద‌వి లో ఉండకూడదు. ఈ నియమాల మేరకు ఇప్పటికే ఎంతోమంది రెండుసార్లు అధ్యక్షులుగా భాద్యతలు సమర్థవంతంగా నిర్వర్తించి ..ఆ తరువాత ఆ పదవి నుండి తప్పుకున్నారు. ఇప్పుడు ఇదే నియమం ప్రస్తుత బీజేపీ జాతీయాధ్యక్షుడు అయిన , కేంద్ర హోం మంత్రి అమిత్ షా కి కూడా వర్తించనుంది.

ఇప్ప‌టికే అమిత్ షా రెండు ధపాలుగా అధ్యక్ష ప‌ద‌వీని చాలా సమర్థవంతంగా నిర్వర్తించారు. ప్రస్తుతం అయన పదవి కాలం ముగిసినట్టు ఉంది. ఆరు నెల‌ల కింద‌ట ఆయ‌న కేంద్ర హోం శాఖ మంత్రిగా కూడా బాధ్య‌త‌లు తీసుకున్నారు. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో భార‌తీయ జ‌న‌తా పార్టీకి కొత్త‌గా జాతీయాధ్య‌క్షుడు రాబోతున్నార‌ట‌. దీనితో కొత్త జాతీయాధ్య‌క్షుడి కోసం వెతుకులాట ప్రారంభించింది. సంక్రాంతి తర్వాత దీనిపై పూర్తి స్థాయి కసరత్తు ప్రారంభించాలని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోంది.

అయితే , బీజేపీ కి కాబోయే కొత్త జాతీయాధ్య‌క్షుడు పై అమిత్ షా ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారని సమాచారం.ప్రస్తుతం బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గా భాద్యతలు నిర్వర్తిస్తున్న నడ్డాకే ఆ ప‌ద‌వి ద‌క్క‌బోతోంద‌నే ప్ర‌చారం సాగుతూ ఉంది. ఆయ‌నే ఆ పార్టీ నేష‌న‌ల్ ప్రెసిడెంట్ కాబోతున్నార‌ని స‌మాచారం. ఇకపోతే, వ్యూహాల కింగ్ గా ఉన్న అమిత్ షా హోం మంత్రిగా వెళ్లి పోయాకా.. పార్టీ కొన్ని ఎన్నిక‌ల్లో ఎదురుదెబ్బతింది. అమిత్ షా హోమంత్రిగా వెళ్ల‌డంతోనే పార్టీ దెబ్బ తిన్న‌దని, బీజేపీ నేతలే కొందరు చెప్తున్నారు. ఈ తరుణంలో ఇప్పుడు అమిత్ షా పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వి నుండి పూర్తిగా తప్పుకుంటే ..వచ్చే కొత్త అధ్య‌క్షుడు బీజేపీ ని ఎలా ముందుకు తీసుకు పోతాడో అని అందరూ చర్చించుకుంటున్నారు.