Begin typing your search above and press return to search.
మోడీకి గుడి.. ఇంతలోనే తొలగింపు.. ఏం జరిగింది?
By: Tupaki Desk | 19 Aug 2021 11:00 PM ISTరాజకీయ నేతలకు గుడులు కట్టే సంస్కృతి పెరుగుతోంది. కొన్నాళ్ల వరకు తమిళనాడుకు మాత్రమే పరిమి తమైన ఈ సంస్కృతి.. ఇటీవల ఏపీకి కూడా పాకింది. తమిళనాడులో ఎంజీఆర్.. దివంగత జయలలితలకు ఆ పార్టీల అభిమానులు గుడులు కట్టడం తెలిసిందే. జయ జీవించి ఉన్న కాలంలోనే ఆమె విగ్రహాన్ని పెట్టి పూజలు కూడా చేశారు. అయితే.. ఈ విధానం.. మన ఏపీలోనూ కొనసాగించేందుకునాయకులు రెడీ అవుతున్నారు. ఇటీవల శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి. కూడా.. నవరత్నాలు అమలు చేస్తున్న సీఎం జగన్ దేవుడితో సమానం అంటూ.. కోటి రూపాయలు ఖర్చు చేసి మరీ.. గుడి కట్టారు.
ఇక, ఇప్పుడు ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీకి కూడా గుడి కట్టిన ఘటన వెలుగు చూసింది. వాస్తవానికి ప్రధా నికి గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఇప్పటికే ఓ చిన్నపాటి ఆలయం ఉండడం గమనార్హం. అయితే.. ఇప్పుడు మహారాష్ట్రలోని పుణేలో కూడా ఒక వీరాభిమాని మోడీకి గుడికట్టారు. దాదాపు లక్షా 60 వేల రూపాయలు ఖర్చు చేసి మరీ.. దీనిని నిర్మించడం గమనార్హం. పుణెకు చెందిన 37 ఏళ్ల మయూర్ ముండే అనే కార్యకర్త.. మోడీకి విరాభిమాని. ఈ క్రమంలోనే మోడీపై తనకున్న అభిమానాన్ని చాటుతూ ఏకంగా రూ. 1,60,000 ఖర్చుతో దేవాలయాన్ని నిర్మించాడు. ఇందు కోసం మయూర్ జైపూర్ మార్బల్‌ను ఉపయోగించాడు.
మోడీకి ఆలయాన్ని నిర్మించడంపై మయూర్ మాట్లాడుతూ.. 'ఆయోధ్యలో రాముడికి దేవాలయాన్ని నిర్మిం చిన నాయకుడికి ఓ దేవాలయం ఉండాలనేది నా భావన. అందుకోసమే నేనున్న ప్రదేశంలో మోడీకి ఆలయాన్ని నిర్మించాను'అని చెప్పుకొచ్చాడు. నిజానికి ఈ ఘటన చెప్పుకోదగిందే అయినప్పటికీ.. ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రధాని మోడీపై వెల్లువెత్తుతున్న వ్యతిరేకత నేపథ్యంలో ఈ ఘటన బీజేపీని ఒకింత ఇబ్బందులలోకి నెట్టిందని అంటున్నారు పరిశీలకులు. ఈ క్రమంలోనే రాత్రికి రాత్రి.. ఈ విషయం తెలియగానే గుడిని.. తొలగించారు.
వాస్తవానికి మోడీ ఆలయం అనగానే.. దానిని తొలగించేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తాయని అందరూ అనుకుంటారు. కానీ, ఏకంగా .. బీజేపీ అధిష్టానం నిర్ణయం.. ప్రధాన మంత్రి కార్యాలయం సూచనల మేరకు .. ఆలయంలో విగ్రహాన్ని తీసేసి.. ఆలయానికి గుడ్డలు చుట్టేశారు. తొలగించిన విగ్రహాన్ని అక్కడే నివాసం ఉంటున్న బీజేపీ కౌన్సిలర్ ఇంటికి తరలించారు. ఇదిలా ఉంటే వచ్చే ఏడాది మొదట్లో పుణేలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ విగ్రహ అంశం ఎన్నికల సమయంలో చర్చకు దారి తీస్తుందన్న కారణంతోనే బీజేపీ హైకమాండ్ విగ్రహాన్ని తొలగించాలని ఆదేశాలు జారీ చేసిందని తెలుస్తోంది.
మరోవైపు ఈ విషయాన్ని అధికార మిత్రపక్షం, బీజేపీకి బద్ధశత్రువుగా ఉన్న.. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) ఓ రేంజ్‌లో తనకు అనుకూలంగా మార్చుకుంది. ఎన్‌సీపీ అధ్యక్షులు ప్రశాంత్ జగ్‌పత్ మాట్లాడుతూ.. 'రోజురోజుకీ పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఆహార పదార్థాల ధరలను తగ్గించమని మోదీ విగ్రహానికి వేడుకుందామని అనుకున్నాం. కానీ విగ్రహాన్ని తొలగించడంతో తీవ్రంగా నిరాశ పడ్డాం. అంతేకాకుండా పెరుగుతోన్న నిరుద్యోగాన్ని కట్టడి చేయమని పూజలు చేద్దామనుకున్నాం' అంటూ ఛలోక్తులు విసిరారు. మొత్తానికి ఈ వ్యవహారం.. దేశవ్యాప్తంగా వైరల్ అవుతుండడం గమనార్హం.