Begin typing your search above and press return to search.
బీజేపీకి రెండంకెల సీట్లూ రావు: పీకే సంచలన వ్యాఖ్యలు
By: Tupaki Desk | 27 Feb 2021 6:54 PM ISTపశ్చిమ బెంగాల్ ఇప్పుడు అధికార టీఎంసీ అధినేత మమతా బెనర్జీకి.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి టఫ్ ఫైట్ నెలకొంది. బెంగాల్ లో గెలుపు కోసం బీజేపీ, టీఎంసీ హోరాహోరీ సాగుతోంది. ఈ క్రమంలోనే బెంగాల్ సీఎం మమతకు తోడుగా రాజకీయ వ్యూమకర్త ప్రశాంత్ కిషోర్ నిలబడి బీజేపీని ఓడించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు.
తాజాగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలపై మరో సవాల్ విసిరారు ప్రశాంత్ కిషోర్. దేశంలో ప్రజాస్వామ్యం కోసం జరుగబోతున్న కీలకమైన పోరులో పశ్చిమ బెంగాల్ ప్రజలు ఇప్పటికే ఎవరిని గెలిపించాలో నిర్ణయించుకున్నారని.. బెంగాల్ తన సొంత బిడ్డనే మళ్లీ కోరుకుంటోందని పీకే సంచలన ట్వీట్ చేశాడు.తాను గతంలో చేసిన ట్వీట్ కు మే2వ తేది ఓట్ల లెక్కింపు రోజున తనను బాధ్యుడిని చేసుకోవచ్చని.. ఫలితాలు తేడా వస్తే ట్రోల్ చేయండంటూ పీకే సవాల్ విసిరడం సంచలనమైంది.
గత ఏడాది డిసెంబర్ లో బెంగాల్ ఎన్నికలపై పీకే ట్వీట్ చేశాడు. బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి కనీసం రెండంకెల సీట్లు కూడా రావని పీకే అంచనా వేయడం గమనార్హం.ఈ ట్వీట్ కు ఇప్పటికీ తాను కట్టుబడి ఉన్నట్లు తాజా ట్వీట్ తో పీకే స్పష్టం చేశాడు. బెంగాల్ లో మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకు పోలింగ్ జరుగనుంది. మే 2న ఫలితాలు వెల్లడి అవుతాయి.