Begin typing your search above and press return to search.

కరోనాని కూడా వదలని బీజేపీ ...!

By:  Tupaki Desk   |   5 March 2020 3:30 PM GMT
కరోనాని కూడా వదలని బీజేపీ ...!
X
సంక్షోభ పరిస్థితులని ...తనకి అనువుగా మలుకున్నవాడే రాజకీయాలలో సక్సెస్ అవుతారు అని చాలామంది చెప్తుంటారు. ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్పే మాట సంక్షోభ పరిస్థితుల్లో అవకాశాలను వెదుక్కుంటూ ఉంటాను. అది అభివృద్ధి లో కావచ్చు , మరో అవసరానికి కావచ్చు కానీ , సంక్షభంలో ఉన్నప్పుడు వేసే వ్యూహాలు పాలిస్తే రాజకీయాలలో ఇక వారికీ తిరుగుండదు. ఇకపోతే ఇప్పుడు ఇదే పద్దతిని బీజేపీ నేతలు కూడా ఒంటపట్టించుకున్నట్టు అర్థమౌతుంది..అసలు ఏం జరిగింది అంటే ...?

చైనాలోని వూహన్ లో పుట్టిన కరోనా వైరస్ .. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తుంది. ఈ వైరస్ ఇప్పటికే భారత్ లో తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ఇప్పటికే భారత్ లో 29 పాజిటివ్ కరోనా కేసులు నమోదైయ్యాయి. దీనితో దేశ వ్యాప్తంగా ఆందోళనలు మొదలైయ్యాయి. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో... పశ్చిమ బెంగాల్ బీజేపీ నాయకులు ఉచితంగా మాస్కులను పంచిపెడుతున్నారు. కరోనా విషం కక్కుతోన్న సమయంలో మాస్క్ లు పంచిపెట్టడం మంచిదే కదా అంటే ...మాస్క్ లు పంచి పెట్టడం మంచిదే.

ఆ మాస్కులపై కమలం గుర్తు, సేవ్‌ ఫ్రమ్‌ కరోనా ఇన్‌ఫెక్షన్‌ మోడీజీ అనే పేరు ముద్రించి ఉండటం ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపుతోంది. పశ్చిమ బెంగాల్‌లో బలంగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్‌ ను ఢీ కొట్టడానికి బీజేపీ నాయకులు కరోనా వైరస్ వల్ల ఏర్పడిన సంక్షోభాన్ని సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ మాస్క్‌లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కోల్‌కత, హౌరా, దక్షిణ 24 పరగణా, దక్షిణ దినాజ్‌పూర్, మేదిని, విష్ణుపూర్, బాంకురా, పురూలియా వంటి చోట్ల విస్తృతంగా ఈ మాస్కులను పంచి పెడుతున్నారు. బీజేపీ గుర్తు, నరేంద్ర మోడీ పేరు ఉన్న మాస్కులను పంపిణీ చేయడం పట్ల అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు తప్పు పడుతున్నారు. కాగా...కరోనా వైరస్ భూతానికి చైనాతో సహా ప్రపంచవ్యాప్తంగా 3 వేలకు పైగా ప్రజలు మృతి చెందారు. లక్ష మందికి పైగా వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నారు